హాట్ హాట్‌గా బాడీ చూపిస్తూ అదిరిపోయే డ్యాన్స్.. నువ్వో సింగర్‌వి కదా ఇలా అంటావా? రాహుల్‌తో శ్రీముఖి

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 32 Highlights || Filmibeat Telugu

గత సీజన్ల లాగే 'బిగ్ బాస్' మూడో సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడూ గొడవలే ఉంటే బాగోదనుకున్నారో ఏమో హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశారు. ఇందులో వాళ్లు రచ్చ రచ్చ చేశారు.

 ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం

బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఈ సారి బిగ్ బాస్ ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఇంటిలోని సభ్యులు ఆట పాటలతో అలరించాలని అందుకే గానూ ఆడిషన్స్ ఇవ్వాలని చెప్పాడు. దీనికి శ్రీముఖి, బాబా భాస్కర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తారని అన్నాడు. ఇంటిలోని కంటెస్టెంట్లు అందరూ తమ తమ టాలెంట్‌తో జడ్జ్‌లను మెప్పించి ప్రదర్శన ఇచ్చేందుకు సెలెక్ట్ అవ్వాలని చెప్పాడు. అదే సమయంలో ఎవరి ప్రదర్శన బాగుంటే వాళ్లకు ఫిజ్ బాటిల్ ఇవ్వాలని జడ్జ్‌లకు చెప్పాడు.

పునర్నవితో మొదలెట్టి...

పునర్నవితో మొదలెట్టి...

ఈ ప్రోగ్రాం పునర్నవి డ్యాన్స్‌తో మొదలైంది. ‘ఇరగ ఇరగ' పాటకు తనదైన మాస్ స్టెప్పులతో ఆమె అదరగొట్టేసింది. ఈ ప్రదర్శన అయిన తర్వాత శ్రీముఖి ఎంతో పొంగిపోయింది. మరో జడ్జ్ బాబా కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ తర్వాత అషు రెడ్డి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమున్న ఇంట్లో వాళ్లు వద్దనే వాళ్లని, దీంతో డోర్లు వేసుకుని ఒక్కదాన్నే డ్యాన్స్ చేసే దాన్నని చెప్పిన అషు రెడ్డి.. ఆ తర్వాత తల్లిదండ్రులకు సారీ చెప్పి ‘జిగేల్ రాణి' పాటకు సూపర్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె డ్యాన్స్‌కు ఫిజ్ బాటిల్ వచ్చింది.

రవి కృష్ణ హైలైట్

రవి కృష్ణ హైలైట్

ఈ టాస్క్ మొత్తానికి రవి కృష్ణ హైలైట్ అయ్యాడని చెప్పాలి. కొద్ది గంటల టాస్క్ కోసం సగం మీసం తీసేశాడు. మొత్తానికి రవి కృష్ణ సరికొత్త గెటప్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు అమ్మాయిగా, మరోవైపు అబ్బాయిగా కనిపిస్తూ డ్యాన్స్ చేశాడు. ర‌వి బ్లాక్ బాస్ట్ బ్లాక్ బాస్ట‌రే సాంగ్‌కి అమ్మాయి అబ్బాయి గెట‌ప్‌తో వ‌చ్చి త‌న‌దైన స్టెప్స్ వేసి మెప్పుపొందాడు. అతడి డెడికేషన్‌కు జడ్జ్‌లతో పాటు హౌస్‌మేట్స్ అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారు.

అలీ సెక్సీ డ్యాన్స్

అలీ సెక్సీ డ్యాన్స్

అలీ స్వింగ్‌జ‌రా పాట‌తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. ఆ తర్వాత స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి వచ్చి తడిచిన బాడీతో హాట్ హాట్ డ్యాన్స్ చేశాడు. అలీ డాన్స్‌కి ఫిదా అయిన శ్రీముఖీ ఆపిల్‌పీజ్ బాటిల్స్ అన్నీ అందిస్తూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. త‌ర్వాత వాటిని తిరిగి జ‌డ్జ‌స్ టేబుల్ మీద పెట్టిన ఆలీ.. బాబా ఇచ్చిన ఆపిల్‌ఫిజ్‌ని దించ‌కుండా తాగేస్తాడు.

మిగిలిన వాళ్లలో...

మిగిలిన వాళ్లలో...

వితిక కళ్లు లేని అమ్మాయిగా ఓ యాక్ట్ చేసింది. ఆమె చేసిన ప్రదర్శన కన్నీళ్లు తెప్పించింది. అంతేకాదు, చివర్లో కళ్లు దానం చేయండి అంటూ మెసేజ్ ఇచ్చింది. శివజ్యోతి ఏదో మ్యాజిక్ చేస్తానని చెప్పి కాసేపు నవ్వులు పూయించింది. హిమజ.. ఓ సక్కనోడా అంటూ పాట పాడింది. మహేశ్ విట్టా ఓ స్టోరీ చెప్పాడు. అందులో తనలోని బాధను చెప్పడంతో పాటు ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. ఇక, వరుణ్ సందేశ్ కూడా ‘ఉండిపోరాదే' పాట పాడాడు. దీనికి అతడికి ఫిజ్ బాటిల్ వచ్చింది.

రాహుల్ నెర్వస్ అయ్యాడు

రాహుల్ నెర్వస్ అయ్యాడు

రాహుల్ విషయానికొస్తే.. ఇకపై ప్రతి టాస్క్‌లో వంద శాతం ఎఫర్ట్ పెడతానని చెప్పిన అతడు.. ఇందులో మాత్రం తడబడ్డాడు. ఏమైపోయావే సాంగ్ మొద‌లు పెట్టి.. రెండు సార్లు ఆగిపోతాడు. నేను పాడ‌లేను గివ్ అప్ అన‌డంతో అంతా ఎంక్రేజ్ చేస్తారు. పాడు రాహుల్‌.. నువ్వో సింగ‌ర్ అయ్యి ఉండి పాడు పాడ‌క‌పోతే ప‌రువు పోతుంది రాహుల్ అంటుంది శ్రీముఖి. ఆ తర్వాత మరోసారి ప్రిపేర్ అయి పాటను ముగించాడు. దీంతో అతడికి కూడా ఫిజ్ బాటిల్ ఇచ్చింది శ్రీముఖి. వాస్తవానికి వీళ్లిద్దరి మధ్య గొడవ ఉన్నప్పటికీ శ్రీముఖి.. రాహుల్‌ను ఎంతగానో ప్రోత్సహించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X