తప్పు చేసి లెంపలేసుకున్న న్యూడ్ లేడీ, కానీ...

ఇటీవల పాకిస్థాన్ కు చెందిన హీరో అనే టీవీ ఛానల్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వీణా మాలిక్ తాను చేసింది తప్పే అని, అందుకు పశ్చాత్తాప పడుతున్నట్లు పేర్కొంది. ఆమె నటించిన ఆ కార్యక్రమాన్ని రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ప్రసారం చేయాలని సదరు టీవీ ఛానల్ నిర్ణయించింది.
అయితే అప్పటికే ఆమె మాట్లాడిన క్లిప్సింగ్స్ కొన్ని ఇంటర్నెట్ లో దర్శనం ఇవ్వడంతో....వీణాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అర్హత లేదని, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి 3వేల ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సదరు టీవీ ఛానల్ ఆకార్యక్రమాన్ని రద్దు చేయక తప్పలేదు.
ప్రస్తుతం వీణా మాలిక్ కన్నడ డర్టీ పిక్చర్ 'డర్టీ పిక్చర్.. సిల్క్ సకత్‌హాట్‌మగ' అనే చిత్రంతో పాటు బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తూ తన సెక్సీ ఆటిట్యూడ్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











