Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జబర్దస్త్ బ్యూటీకి లవ్ ప్రపోజల్.. రచ్చ చేసిన యువకుడు.. పబ్లిక్‌లో అందరూ చూస్తుండగానే!
పబ్లిక్‌లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడు జబర్దస్త్ బ్యూటీకి లవ్ లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఊహించని ఆ పరిణామంతో ఆమె ఒక్కసారిగా షాకై పోయింది. తీరా చివరకు అదే యువకుడు చల్లగా ఓ మాట చెప్పి ఆమెను మరింత ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ జబర్దస్త్ బ్యూటీ ఎవరు? అసలేం జరిగింది? వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ ప్రియాంక.. అదిరింది
లేడీ గెటప్పులో జబర్దస్త్ తెరపై వినోదాలు పంచిన సాయితేజ.. ఇప్పుడు ప్రియాంక (పింకీ)గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి లేడీ అయిపోయాడు సాయి తేజ. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు కూడా. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు జబర్దస్త్‌కి దూరంగా ఉన్న పింకీ ప్రస్తుతం అదిరింది షోలో యాక్ట్ చేస్తోంది.

రెగ్యులర్‌గా నాగబాబుతో
ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో ఇటీవలే 'అదిరింది' షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో యాంకర్‌గా రవి, నాగబాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పింకీగా మారక చాలా గ్యాప్ తీసుకున్న ఈమె వీళ్ళతో పాటే ఈ షోలో రెగ్యులర్‌గా పాల్గొంటోంది.

అందరూ చూస్తుండగానే ఐ లవ్ యూ
అయితే అదిరింది షో షూటింగ్‌లో ఉండగా ఆమెకు వద్దకు ఓ యువకుడు వచ్చి సడెన్ షాక్ ఇచ్చాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. షూటింగ్ లొకేషన్‌లో బ్రేక్ సమయంలో సరదాగా బయట కూర్చున్న ఈమెకు అందరూ చూస్తుండగానే ఐ లవ్ యూ చెప్పాడు ఆ యువకుడు. దీంతో ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యపోయింది.

పింకీ రియాక్షన్.. అసలు విషయం బయటపెట్టి
మేడం.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఓకే అనాలే గానీ పెళ్లి చేసుకుంటానని పింకీతో అన్నాడు ఆ యువకుడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన పింకీ.. ఏంటి? పిచ్చా నీకు. ఇక్కనుంచి వెళ్ళిపో అనేసింది. అయినప్పటికీ ఆ యువకుడు అలాగే విసిగించాడు. చివరకు ఆమెకు చిర్రెత్తే కోపం వస్తున్న సమయంలో అసలు విషయం బయటపెట్టి మరింత ఆశ్చర్యపర్చాడు ఆ యువకుడు.

జస్ట్ సరదగా అంటూ మెల్లగా..
మేడం ఇది ప్రాంక్ వీడియో. జస్ట్ సరదగా చేశానంతే అని చెప్పి మెల్లగా జారుకున్నాడు. మొదట ఆ లవ్ ప్రపోజల్ తో కాస్త కంగారు పడిన పింకీ.. చివరకు అసలు విషయం తెలిసి తనలో తానే నవ్వుకొని లైట్ తీసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో జనం కూడా ఈ ఇద్దరి లవ్ సీన్ చూసి తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియా కొత్తపుంతలు.. యువకుల సరదా
ప్రస్తుతం సోషల్ మీడియా కొత్తపుంతలు తొక్కుతోంది. దీనికి అనుగుణంగా కొందరు ఇలా ప్రాంక్ వీడియోలు చేసి తమ సరదా తీర్చుకోవడమే గాక.. యూ ట్యూబ్‌లో పెట్టి తమ డబ్బు సంపాదిస్తున్నారు. ప్రెజెంట్ యూత్ ఈ మోడ్ లోనే ఉంది. ఫన్ ఎంజాయ్ పేరుతో చేస్తున్న ఈ వీడియో కొన్ని సందర్భాల్లో లేనిపోని ఇబ్బందుకు కూడా తెచ్చిపెడుతున్నాయి.