యాంకర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన హైపర్ ఆది.. వామ్మో! మామూలుగా లేదు యవ్వారం.. వీడియో వైరల్
జబర్దస్త్ కమెడియన్‌గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు హైపర్ ఆది. తనదైన పంచ్ డైలాగ్స్ వేస్తూ కిక్కిచ్చే ఈ కమెడియన్.. తాజాగా ఓ యంగ్ యాంకర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేశాడు. ఆ వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? హైపర్ ఆది రొమాన్స్ నిజమేనా? వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ ఛాన్స్.. అనసూయ మొదలుకొని అందరూ!
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీ వాళ్లందరికీ మంచి మంచి ఛాన్సులు తెచ్చిపెడుతోంది.
యాంకర్ అనసూయ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ సినిమా ఛాన్సులు పట్టేస్తున్నారు. ఈ బాటలోనే కామెడీ పంచ్‌లతో పరేషాన్ చేసే హైపర్ ఆది కూడా జబర్దస్త్ ఛాన్సులు కొట్టేస్తున్నాడు.

హైపర్ ఆది రొమాంటిక్ డోస్
హైపర్ ఆదిలో కేవలం పంచులు వేయడం మాత్రమే కాదండోయ్! మరో లక్షణం ఉంది. అదే రొమాంటిక్ డోస్.. బుల్లితెరపై ఆయన ఇచ్చే రొమాంటిక్ కిక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అనసూయ- హైపర్ ఆది జోడీకి, వాళ్ళ మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలకు భలే డిమాండ్ ఉంటుంది.

అనసూయ అందాన్ని పొగిడేస్తూ..
యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. అందుకే అనసూయ- హైపర్ ఆది జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్.

ఆమెతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఆది
ఇదిలా ఉంటే తాజాగా మరో యంగ్ యాంకర్‌తో హైపర్ ఆది రెచ్చిపోయి రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా విడుదలైన ఢీ చాంపియన్స్ ప్రోమోలో యాంకర్ వర్షిణితో.. మనోడి రొమాన్స్ మాములుగా లేదు. ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వర్షిణి- హైపర్ ఆది కెమిస్ట్రీ
ఈ మద్యే హోస్ట్ అవతారమెత్తిన హైపర్ ఆది.. యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా చేస్తున్న ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండుతోంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ కిక్కిస్తున్నాడు హైపర్ ఆది.
దొరికితే రెడీ.. అస్సలు వదలను
ఇకపోతే త్వరలోనే తాను కూడా సుధీర్ లాగే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఇటీవలే ప్రకటించాడు హైపర్ ఆది. తనకు పాటలు, ఫైట్లు అంతగా సెట్ కావు అని, ప్రస్తుతానికి పాటలు, డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నానని తెలిపాడు. మంచి కథ దొరికితే రెడీ అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.


Click it and Unblock the Notifications











