నాగబాబు అందుకే జంప్.. బయటపడిన అసలు సీక్రెట్! హాట్ టాపిక్..
మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్ వదిలి వేరే ఛానెల్‌కి వెళ్లిపోయారో అప్పటినుంచే ఈయనపై రకరకాల వార్తలు జబర్దస్తీ చేస్తున్నాయి. ఇన్నాళ్లు జబర్దస్త్ షోని ముందుండి నడిపించిన ఆయన వెళ్లిపోవడానికి కారణాలివే అంటూ ఎన్నో వార్తలు షికారు చేశాయి. వాటిలో ఎక్కువగా వైరల్ అయింది మాత్రం నాగబాబు రెమ్మ్యూనరేషన్ ఇష్యూ. మళ్ళీ ఇప్పుడిదే అంశంపై అసలు సీక్రెట్ అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

బెస్ట్ టీఆర్పీ.. ఏడేళ్ల పాటు
జబర్దస్త్‌ను కేవలం 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని, తనతో పాటు రోజాను జడ్జిగా సెలెక్ట్ చేశారని గతంలోనే నాగబాబు చెప్పారు. అయితే ఒకవేళ తనకు నచ్చితే 25 ఎపిసోడ్స్ ఏంటి.. ఎన్ని ఎపిసోడ్స్ చేసేందుకు తాను సిద్దమే అనుకున్నానని మెగా బ్రదర్ అన్నారు. ఈ షో బెస్ట్ టీఆర్పీ తెచ్చి, ఏడేళ్ల పాటు కంటిన్యూ అయిందని నాగబాబు అన్నారు.

డబ్బు కోసమే ఇలా..
అయితే నాగబాబు డబ్బు కోసమే జబర్ధస్త్ కామెడీ షో వేదిలేశారని, అందుకే ఆయన అక్కడ్నుంచి తప్పుకుని ఇప్పుడు జీ తెలుగుకు వచ్చేశాడని అంటున్నారు. తన స్థాయికి తగిన రెమ్యునరేషన్ అక్కడ ఇవ్వకపోయినా కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నానని నాగబాబు చెప్పడం చర్చనీయాంశం అయింది.

మూడు రెట్లు ఎక్కువ.. అందుకే
తాజాగా అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. ఇప్పుడు జీలో అదిరిపోయే పారితోషికం అందుకుంటున్నాడట. గతంలో జబర్దస్త్ షోకి వచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇక్కడ ఇస్తున్నారని, అందుకే నాగబాబు ఛానెల్ మార్చేసాడని ప్రచారం ఊపందుకుంది.

అదనంగా 20 లక్షలు
జీ నెట్ వర్క్ నుంచి నాగబాబు.. ప్రతీ నెల 30 లక్షలతో పాటు సెట్‌లో, బయట కూడా వీఐపీ సౌకర్యాలు అందుకుంటున్నాడని తెల్సుతోంది. ఇదే గతంలో అయితే 15 నుంచి 20 లక్షల వరకూ వచ్చేదని, కానీ ఇప్పుడు ఛానెల్ మారిన తర్వాత దానికంటే మరో 20 లక్షలు అదనంగానే నాగబాబు అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

నాగబాబు లేకున్నా జబర్దస్త్ హవా
మరోవైపు నాగబాబు ఉన్నా లేకున్నా కూడా జబర్దస్త్ హవా మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇటీవలే వచ్చిన ఈ షో టీఆర్ఫీ రేటింగ్స్‌లో గతానికి, ఇప్పటికి ఎలాంటి మార్పు కనిపించకపోవడం విశేషం. చూడాలి మరి నాగబాబు యాడ్ అయ్యాడు కాబట్టి ఇకపై జీ నెట్ వర్క్ ప్రభావం ఎలా ఉంటుందనేది.


Click it and Unblock the Notifications











