బిగ్‌బాస్ హౌస్‌లో భారీ ప్రయోగం.. ఇక్కడ చీరలు కుదరవు అంటున్న దీప్తి, బయటకు రమ్మను వాడిని!
Recommended Video

ఆడియన్స్ కు మసాలా అందించే టాస్క్ లు, ప్రతి వారం ఉత్కంఠ రేకెత్తించే ఎలిమినేషన్లతో బిగ్‌బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో కీలక సభ్యులు ఎలిమింట్ అవుతుండడంతో షోపై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి పెరుగుతోంది. పెరుగుతున్న ఆసక్తి అనుగుణంగానే కంటెస్టెంట్స్ విభిన్నమైన టాస్క్ లతో అలరిస్తున్నారు. కాగా నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో హౌస్ సభ్యులు భారీ ప్రయోగానికి తెరలేపారు.

ఏకంగా సినిమానే
హౌస్ లోని సభ్యులంతా ఓ సినిమాని తెరకేక్కిన్చాబోతున్నారు. ఇదంతా టాస్క్ లో భాగమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కు కావలసిన ఏర్పాట్లని హౌస్ సభ్యులు చేస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హౌస్ లోనే ఆడిషన్స్
ఈ సినిమాలో నటించే నటీ నటులకు ఆడిషన్స్ చాలా సరదాగా జరుగుతున్నాయి. గీతా మాధురి, కౌశల్, బాబు గోగినేని, తనీష్ సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బాహుబలి యుద్ధంలో
సినిమాలో నటించే అవకాశం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా సరదాగా ఉన్నాయి. ఆడిషన్స్ లో పాల్గొన్న తనీష్ మాట్లాడుతూ.. బాహుబలి 1 లో యుద్ధంలో 20 వ వరసలో ఉండేది తానే అని చెప్పుకుంటున్నాడు.

చీరలు కుదరవు
ఇక గీతా మాధురి సినిమాలో అవకాశం కోసం చీర కొంగు ఊపుతూ వయ్యారాలు పోతుంది. మా సినిమాలో చీరలు కుదరవు అంటూ దీప్తి నవ్వులు పూయిస్తోంది. వాడికి ఇష్టం లేని భాష మాట్లాడితే జైల్లో పెడుతాడా.. బయటకు రమ్మను వాడిని అంటూ బాబు గోగినేని యాంగ్రిగా డైలాగ్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











