Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌పై దారుణమైన కామెంట్లు.. బాడీ షేమింగ్ చేసిన ఆ కంటెస్టెంట్లు ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఉల్టాపుల్టా అంటూ వచ్చి అందిరనీ తెగ అలరిస్తోంది. అద్భుతమైన టాస్క్ లు ఇస్తూ.. అంతకు మించిన ట్విస్టులతో రసవత్తరంగా మారుస్తోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఛాలెంజ్ లు ఇస్తూ కంటెస్టెంట్ల నుంచి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను లాగేస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్లతో వాళ్లలో వాళ్లకు గొడవలు పెట్టి బుల్లితెర ప్రేక్షకులకు ఎంజాయ్ మెంట్ ను అందిస్తున్నారు. ఈరోజుటితో కాస్త నామినేషన్ల వేడి తగ్గింది అనుకునే లోపే బిగ్ బాస్ షోలో మరో విషయం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా... పల్లవి ప్రశాంత్ మొదటి వారంలోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అయితే అంతా కలిసి ఆయనను కార్నర్ చేయడంతో బయట ఆయనకు విపరీతమైన పాజిటివిటీ వచ్చింది. అంతా కలిసి రైతుబిడ్డను కావాలని వేధిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇలా విపరీతమైన స్థాయిలో పల్లవి ప్రశాంత్ కు ఫ్యాన్స్ పెరిగారు. ఇక అప్పటి నుంచి ఆయన అద్భుతమైన ఆట ఆడుతూ టాప్ లో ఉంటున్నాడు. కచ్చితంగా టాప్ 5లో కూడా ఉంటాడనే టాక్ నడుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా హౌస్ మేట్స్ ఈయనపై మరోసారి విరుచుకు పడ్డారు.

Housemates Body Shaming on Pallavi prashanth Bigg Boss Telugu 7

ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై దారుణమైన కామెంట్లు చేశారు. ఆయన రాకేసిన చింత పిక్కలా ఉంటాడంటూ అంబటి అర్జున్ అనగా... అమర్ దీప్ కూడా ఆయనకు వంత పాడాడు. ఓవైపు రాకేస్తే.. ఎలా కనిపిస్తుందో అచ్చం అలాగే కనిపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా సీరియస్ గా కాదులెండి.. కామెడీగానే. పల్లవి ప్రశాంత్ గడ్డం, జుట్టు బాగా పెంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే వాటిని ఓ షేప్ చేశాడు. దాన్ని చూపించేందుకు హౌస్ మేట్స్ వద్దకు వచ్చాడు. ముఖ్యంగా రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణలు ఓ వద్ద కూర్చొని ఉండగా వారి దగ్గరకు వెళ్లాడు.

ఎట్లుంది నా గడ్డం, జుట్టు అంటూ అడిగాడు. అది చూసిన వెంటనే అంబటి అర్జున్ ఫన్నీగా స్పందించాడు. జుట్టు మొత్తం పైకి ఉబ్బినట్లుగా కనిపిస్తోందని.. ముఖం అంతా లోపటికి వెళ్లిపోయిందని అన్నాడు. ఆ తర్వాత వెంటనే రాసేకిన చింత పిక్కలా కనిపిస్తున్నావురా అంటూ ఫన్నీగా కామెంట్లు చేశాడు. అమర్ దీప్ కూడా అంబటి అర్జున్ చేసిన కామెంట్ నే మరోసారి చెప్పాడు. దానికి పల్లవి ప్రశాంత్ ఫుల్లుగా నవ్వుకుంటూ కూర్చున్న గౌతమ్ కృష్ణపై పడి పడుకుంటాడు. ఎపిసోడ్ లో ఈ వీడియో రాకపోయినప్పటికీ.. నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో పల్లవి ప్రశాంత్ ను కాస్త దూరం పెట్టిన వాళ్లంతూ ఇప్పుడు అతడితో బాగానే ఉంటున్నారు. చక్కగా కలిసిపోతూ.. ఆయననూ తమలో కలుపుకున్నారు. లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా జనాల్లో మార్కులు కొట్టేసేందుకు రైతుబిడ్డతో బాగానే వ్యవహరిస్తున్నారు. బయటకు వచ్చాక కూడా పల్లవి ప్రశాంత్ తో స్నేహం ఇలాగే కొనసాగిస్తే.. నిజంగానే వారు ఇతడితో స్నేహం చేసినట్లేనని చాలా మంది అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X