బిగ్ బాస్2: హౌస్‌లో 24 సినిమా, అజ్ఞాతవ్యక్తి లోనికి.. కక్కలేక మింగలేక!
Recommended Video

బిగ్ బాస్ అత్యంత రసవత్తరంగా మారుతోంది. మరికొద్ది రోజుల్లో షో ముగియబోతుండడంతో వినోదాన్ని అందించే టాస్క్ లతో ఇంటి సభ్యులు అలరిస్తున్నారు. మంగళవారం జరగబోయే టాస్క్ వినోదాత్మకంగా ఉండబోతోంది. హౌస్ లో ఉండేది 7 మంది మాత్రమే అయినా షో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నేడు జరగబోయే టాస్క్ కు సంబంధించి ప్రోమో విడుదల చేసారు. బిగ్ బాస్ నేడు ఇంటి సభ్యులకు 24 సినిమా చూపించబోతున్నాడు. 24 సినిమా ఏంటని అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళదాం..

ఆటాడుకుంటున్న బిగ్ బాస్
ఇంటి సభ్యులని బిగ్ బాస్ కంట్రోల్ చేయబోతున్నాడు. అంటే 24 సినిమా తరహాలో బిగ్ హోస్ హౌస్ ని కొంత సమయం ఫ్రీజ్ చేస్తో, మరికొంత సమయం నార్మల్ గా ఉంచుతున్నాడు. బిగ్ బాస్ ఫ్రీజ్ అని చెప్పగానే ఎక్కడివాళ్ళు అక్కడే కదలకుండా ఉండిపోవాలి.

ఇంటిలో అజ్ఞాతవ్యక్తి
ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హౌస్ లోకి ప్రవేశించాడు. జోకర్ గెటప్ లో వచ్చి హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. అతడు ఏం చేసినా ఇంటి సభ్యులు కదలడానికి వీల్లేదు.

కక్కలేక మింగలేక పోతున్నారు
జోకర్ గెటప్ లో వచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియదు. ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ లో ఉండగా హౌస్ మేట్స్ ని ఆటపట్టిస్తున్నాడు. రోల్ రైడ దగ్గరకు వెళ్లి అతడి నోటిలో కేకు కుక్కుతున్నాడు. గిలిగింతలు పెడుతుంటడంతో రోల్ కక్కలేక మింగలేక నవ్వు ఆపుకుంటున్నాడు. ఈ సన్నివేశాలన్నీ చాలా వినోదాత్మకంగా ఉన్నాయి.

బయటకు పారిపోయాడు
ఇంటి సభ్యులు నార్మల్ మోడ్ లోకి రాగానే ఆ జోకర్ హౌస్ నుంచి పారిపోవడం విశేషం. ఈ ఎపిసోడ్ లో నవ్వులే కాదు.. హృదయాన్ని హత్తుకునే ఎమోషన్ కూడా ఉంది. ఎందుకంటే నేటి ఎపిసోడ్ లో మరో సర్ ప్రైజ్ కూడా ఉంది.

అమిత్ ఫ్యామిలీ
ఇంటిలోకి నేడు అమిత్ ఫ్యామిలీ రాబోతున్నట్లు ప్రోమోలో చూపించారు. పప్పా అంటూ అమిత్ కొడుకు అతడిని కౌగిలించుకోగానే అతడు భావోద్వేగానికి గురయ్యాడు. అమిత్ సతీమణి కూడా హౌస్ లోకి ఎంటర్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











