Brahmamudi : బ్రహ్మముడికి మానస్ రెమ్యునరేషన్ ఎంత? ఒక్కరోజుకి ఎన్ని లక్షల పారితోషికమంటే?
మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో బ్రహ్మముడి ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో కొనసాగుతోంది. టీఆర్పీలో ఈ ధారావాహిక దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ లేదంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మముడిలో హీరో రాజ్‌గా బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి అద్భుతంగా నటించారు. భార్యను అర్ధం చేసుకోకుండా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే భర్తగా మానస్ ఒదిగిపోయారు. మరి బ్రహ్మముడిలో నటిస్తున్నందుకు గాను మానస్ రెమ్యునరేషన్ ఎంత? రోజుకు ఎన్ని లక్షలు అందుకుంటున్నాడంటే?
ఆగస్ట్ 2, 1990న విశాఖపట్నంలో జన్మించారు మానస్ నాగులపల్లి. ఆయన పూర్తి పేరు మాస్టర్ రామ్ తేజ. చిన్నతనం నుంచే మానస్ తన ప్రతిభను చాటుకున్నారు. డ్యాన్సులు, యాక్టింగ్‌లోనే కాకుండా చదువుల్లో కూడా ఆయన టాపర్. మంచి ర్యాంక్ సాధించిన ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు అందుకొన్నాడు. డ్యాన్సుల్లో ఇరుగదీసి.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నాడు మానస్ నాగులపల్లి.

మానస్ బాల నటుడిగా 2001లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. బీ గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఆయన క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగానూ అలరించారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యాడు. తన ఆట తీరుతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా వారి అభిమానాన్ని సాధించాడు. అయితే బిగ్‌బాస్ టైటిల్ సాధించాలనుకున్న కల తీరకుండానే వెనుదిరిగాడు.
బిగ్‌బాస్ రియాలిటీ షో మానస్‌ను కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ షో తర్వాత మానస్‌కు భారీ ఆఫర్లు వచ్చాయి. యాంకర్ విష్ణుప్రియతో కలిసి ఆయన చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. శ్రీజ నిశ్శంకరను పెళ్లి చేసుకున్నారు మానస్. బుల్లితెరపై ఫోకస్ చేసిన ఆయన కోయిలమ్మ, కార్తీక దీపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మముడిలో హీరోగా అవకాశం దక్కించుకున్నారు. తన నటనతో మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరై బుల్లితెరపై టాప్ యాక్టర్లలో ఒకడనే పేరు తెచ్చుకున్నాడు.
ఇక బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ పాత్రలో నటించినందుకు గాను మానస్ భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నాడు. ఈ ధారావాహికలో నటించిన ఆయనకు ప్రతీ రోజు 50 వేల రూపాయల చొప్పున పారితోషికాన్ని అందుకొంటున్నట్టుగా టాక్. దాదాపుగా నెలలో 20 నుంచి 25 రోజులు షూటింగ్‌లో పాల్గొంటారని అంచనా. దీనిని బట్టి మానస్‌కు మొత్తంగా రూ. 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు బుల్లితెర వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











