భానుమతికి సాయికిరణ్ రెమ్యునరేషన్ ఎంతంటే?.. గుప్పెడంత మనసు తర్వాత ఎంత పెరిగిందంటే?
ప్రస్తుతం సినిమాతో సమానంగా సీరియల్స్ పాపులారిటీ పెరుగుతోంది. ధారావాహికల్లో నటించే వారికి ప్రేక్షకుల ఆదరణతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా దక్కుతోంది. గతంలో మాదిరిగా వెయ్యో, పదివేలో చేతిలో పెట్టడం లేదు.. టీఆర్పీ రేటింగ్స్‌ను బట్టి లక్షలు డిమాండ్ చేస్తున్నారు బుల్లితెర నటులు. డిమాండ్, ప్రేక్షకుల్లో క్రేజ్‌ను బట్టి భారీగా చెల్లించేందుకు దర్శక నిర్మాతలు కూడా వెనుకాడటం లేదు. ఏదైనా ఒక సీరియల్ హిట్ అయితే తర్వాత నటించే సీరియల్స్‌కు బుల్లితెర నటులు తమ రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు సాయి కిరణ్. ప్రముఖ సింగర్ రామకృష్ణ కుమారుడైన ఆయన తొలుత నటుడిగా సినీరంగంలో అడుగుపెట్టి నువ్వేకావాలిలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ ఆఫర్లు అంతగా రాలేదు. దీంతో చిన్నాచితకా సినిమాలు, గెస్ట్ రోల్స్ చేస్తూ వచ్చారు సాయి కిరణ్. ఆ తర్వాత అనుకోకుండా బుల్లితెరపై అడుగుపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. వెండితెరను మించిన క్రేజ్‌ను ఇక్కడ సొంతం చేసుకున్నారు సాయి కిరణ్.

కోయిలమ్మ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టిన సాయికిరణ్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సీరియల్స్‌తో బిజీగా మారిపోయారు. స్టార్ మాలో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసులో మహేంద్రగా కీలకపాత్ర పోషించారు సాయికిరణ్. హీరో తండ్రిగా, జగతి మేడం భర్తగా ఆయనను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ పాపులారిటీతో సాయికిరణ్‌కు పలు సీరియల్స్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
స్వతహాగా శివభక్తుడైన సాయికిరణ్ దాదాపు 3000కు పైగా పాములను రక్షించి తన మంచి మనసును చాటుకున్నారు. అవగాహన లేని జనం పాములను విచక్షణారహితంగా చంపుతుంటే చూడలేక , పాముల్ని పట్టుకుని వాటిని సురక్షిత ప్రదేశాల్లో వదిలేస్తున్నాడు. ఇందుకోసం ఆయన ప్రొఫెషనల్స్ దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాడు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పాముల్ని పట్టుకుని వాటిని శ్రీశైలం అడవుల్లో వదిలేసే పనిని చేస్తున్నాడు సాయికిరణ్.
తొలుత వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లాడిన సాయికిరణ్ కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి.. కోయిలమ్మ అనే సీరియల్‌లో తనతో నటించిన స్రవంతిని ఇటీవల పెళ్లాడారు. ప్రస్తుతం పడమటి సంధ్యా రాగం సీరియల్‌తో పాటు స్టార్ మాలో కొత్తగా ప్రారంభమైన భానుమతి అనే సీరియల్‌లో నటిస్తున్నారు సాయికిరణ్. ఇందులో రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన సాయికిరణ్ - స్రవంతిలు రీల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఇందులో వారి పాత్రల పేర్లు బలరామ్ - శారద.
మార్చి 10 నుంచి ప్రసారమవుతున్న ఈ భానుమతి సీరియల్ ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తుంది. ఇక ఈ సీరియల్ కోసం సాయికిరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది. రోజుకు రూ.30,000ను రెమ్యునరేషన్ కింద తీసుకుంటారు సాయికిరణ్. నెలకు 10 నుంచి 15 రోజులు షూటింగ్ ఉంటే ఈ లెక్కన రూ.5 లక్షలను పారితోషికంగా అందుకుంటాడు. ఇక మిగిలిన సీరియల్స్ ద్వారా మరో రూ. 10 నుంచి రూ.15 లక్షల చొప్పున నెలకు రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారట సాయికిరణ్.


Click it and Unblock the Notifications











