Brahmamudi కావ్య పాత్రకు దీపికా రంగరాజు రెమ్యునరేషన్ ఎంత? ఒక్కరోజుకి ఎన్ని లక్షల పారితోషికమంటే?
తెలుగు సీరియల్స్‌లో ప్రస్తుతం స్టార్ మాలో వచ్చే ధారావాహికలు దుమ్మురేపుతున్నాయి. వాటిలోనూ బ్రహ్మముడి టాప్‌లో కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు మించిన రేటింగ్‌తో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సీరియల్‌ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ ధారావాహికలో ఫిమేల్ లీడ్ కావ్య పాత్ర పోషించిన దీపిక రంగరాజు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆత్మాభిమానం చంపుకోలేని మహిళగా, భర్తను మార్చాలనే భార్యగా అద్భుతంగా నటించారు దీపిక. మరి బ్రహ్మముడిలో నటిస్తున్నందుకు గాను దీపిక రెమ్యునరేషన్ ఎంత? రోజుకు ఎన్ని లక్షలు అందుకున్నారంటే?
తమిళనాడులోని పన్రూతికి చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొన్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆమె పలు కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకొన్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ఆరంభించారు దీపిక. చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సీరియల్‌కు తమిళ బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ధారావాహికతో దీపికకు మంచి పేరు లభించింది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ మా నిర్మించిన బ్రహ్మముడి సీరియల్‌లో ఆమె అవకాశం దక్కించుకున్నారు.

కావ్య పాత్రలో దీపిక ఒదిగిపోయారు. అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఆ రోల్ చుట్టూనే బ్రహ్మముడి నడుస్తుంటుంది. నిజానికి ఆ సీరియల్ మొత్తాన్ని మానస్‌తో కలిసి ఆమె తన భుజాలపై మోస్తోంది. బ్రహ్మముడికి టాప్ రేటింగ్ దక్కడానికి దీపిక కూడా ఓ కారణమని బుల్లితెర ప్రేక్షకులు అంటుంటారు. ఈ సీరియల్‌లో ఎంతో అమాయకంగా, ఒద్దికగా కనిపించే దీపిక నిజానికి అల్లరి పిల్ల. సెట్‌లో అడుగుపెట్టిందంటే చాలు సందడి సందడి చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ ఛానెల్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.
అతి కొద్ది సమయంలోనే తెలుగులో దీపికకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు కుటుంబ ప్రేక్షకుల ప్రేమను పొందారు దీపిక. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపిక తన సీరియల్స్ షూటింగ్స్, వ్యక్తిగత వివరాలు, ఇతర సంగతులు పంచుకుంటూ ఉంటారు. ఈమె ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. బ్రహ్మముడి సీరియల్‌లో నటిస్తున్నందుకు దీపిక రంగరాజు ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకొంటుందా అని బుల్లితెర ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉంటారు. ఈ సీరియల్‌లో నటించినందుకు గాను ఆమెకు పెద్ద మొత్తమే ముడుతుందని టీవీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ప్రతీ రోజు సుమారుగా 35 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇలా దాదాపు 25 రోజులపాటు షూటింగ్‌లో ఆమె పాల్గొంటారు. దాంతో దీపిక రంగరాజు ఓ నెలకు సుమారుగా రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తారని బుల్లితెర వర్గాల టాక్.

ఇదిలా ఉండగా.. తమిళ, తెలుగు టీవీ రంగంలో రాణిస్తున్న దీపిక రంగరాజు.. తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు లభించింది. కథ, పాత్ర నచ్చితే సినిమాల్లోనూ నటిస్తానని దీపికా రంగరాజు పలుమార్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











