Brahmamudi : రుద్రాణి‌ రోల్‌కు షాకింగ్ రెమ్యునరేషన్ .. షర్మిత గౌడకు ఒక్కరోజు పారితోషికం ఎంతంటే?

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ స్టార్‌ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. బడా హీరోల సినిమాల రేటింగ్స్ కూడా ఈ సీరియల్ దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. ఆకట్టుకునే కథ, కథనం, భార్యాభర్తల మధ్య జరిగే ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఈ ధారావాహికకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సీరియల్‌లో నటిస్తున్న వారికి అదే స్థాయిలో క్రేజ్ దక్కుతోంది.

అందం, అభినయం ఉన్న వాళ్లకి బుల్లితెరపై అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటే చాలు దర్శక నిర్మాతలు, ఆడియన్స్ వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక సీరియల్స్‌లో హీరోయిన్లుగా, ఇతర సహాయక పాత్రలు పోషించే అమ్మాయిలు చాలా అందంగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లను మించిన అందం వీరి సొంతం. ఈ కోవలోకే వస్తారు బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణిగా విలన్‌ రోల్‌లో నటిస్తున్న షర్మిత గౌడ.

how much actress sharmitha Gowda gets remuneration for brahmamudi serial

బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. రాజ్- కావ్యలు తెలుగింటికి బాగా చేరువయ్యారు. వారితో పాటు కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీరియల్ హీరో హీరోయిన్లకు సమానంగా పేరు తెచ్చుకున్నారు షర్మిత గౌడ. బ్రహ్మముడిలో విలన్‌గా ఆమె అద్భుతంగా నటించారు.

తనను ఆదరించిన కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు పెడుతూ.. కాపురాలు కోల్పోయేలా చేసే జిత్తులమారి నక్కలాంటి రుద్రాణి క్యారెక్టర్‌లో షర్మిత ఒదిగిపోయారు. రాజ్ - కావ్యలను కలపాలని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రయత్నించిన ప్రతిసారి మధ్యలో దూరి రుద్రాణి చెడగొడుతూ ఉంటుంది. ఆమెను స్క్రీన్‌పై చూసినప్పుడల్లా మహిళా ప్రేక్షకులు తిట్టుకుంటూ ఉంటారంటే షర్మిత ఎంత అద్భుతంగా నటించారో చెప్పవచ్చు.

నిజానికి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమె సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడకపోవడం వృత్తిపట్ల షర్మిత అంకితభావానికి నిదర్శనం. ఆమె వయసు కేవలం 34 ఏళ్లే.. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ కావడం విశేషం.

ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షర్మిత.. ఈ క్రమంలో బ్రహ్మముడి ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సీరియల్ ద్వారా ఆమ పాపులారిటీ డబులైందని చెప్పవచ్చు. ఇంతటి కీ రోల్ పోషిస్తున్న షర్మిత గౌడకు బ్రహ్మముడి మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు బుల్లితెర టాక్. ఆమెకు రోజుకు రూ. 20 వేల చొప్పున పారితోషికంగా అందజేస్తున్నట్లుగా టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నెలలో దాదాపు 25 రోజుల పైనే షూటింగ్‌లో పాల్గొనే ఆమె సుమారుగా రూ.7 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: sharmitha gowda brahmamudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X