యాంకర్ సుమ ఆదాయం ఎంతో తెలుసా? ఒక్కో ఫంక్షన్‌కు ఎంత తీసుకొంటారంటే!
తెలుగు వినోద రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే.. ఇంకెవరు? యాంకర్ సుమ ఠక్కున సమాధానం దొరుకుతుంది. యువ యాంకర్లు తెరమీదకు ఎంత మంది పుట్టుకొచ్చినప్పటికీ సుమనే టాప్ ర్యాంక్‌తో దూసుకెళ్తున్నారు. అయితే క్షణం తీరిక లేకుండా ఫంక్షన్లు, ప్రోగ్రాంతో సుమ బిజీ బిజీగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం సుమకు సంబంధించిన ఆదాయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. ఇంతకు సుమ నెలకు ఎంత మొత్తం సంపాదిస్తున్నారంటే..

ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా
సినిమా రంగంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గానీ, సక్సెస్ మీట్ గానీ ఏదైనా జరిగితే సుమ లేకుండా నిర్వహించడం కష్టమే చెప్పాలి. ఏ కార్యక్రమమైనా సుమనే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పుకొంటారు. సుమకు వీలు కాకపోతేనే మరో యాంకర్ కోసం చూస్తారనే ఇండస్ట్రీలో టాక్. అలా సుమ కెరీర్ జోరు మీద సాగిపోతున్నది.

మాటల మ్యాజిక్‌తో
యాంకర్ సుమకే ఇంత క్రేజ్ అంటే.. బడా హీరోలైనా, నిర్మాతలనైనా మాటల చతురతతో మెప్పిస్తారు. ఫంక్షన్‌లో సమయస్ఫూర్తి, మాటల మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. అందుకే సుమ యాంకరింగ్, హోస్టింగ్‌ను అందరూ ఆదరిస్తారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీతో ఉన్న చిరకాల పరిచయాలు ఆమెను ఇంకా టాప్ రేంజ్‌లో ఉండటానికి కారణమని చెప్పుకొంటారు.
Recommended Video


సౌమ్యం, మాటతీరు, ప్రవర్తనే బలం
ఇక మిగితా యాంకర్ల విషయాన్ని పక్కన పెడితే.. సుమ పూర్తిగా వివాదాస్పదంగా ఉంటారు. టెలివిజన్ రంగమైనా.. సినిమా పరిశ్రమలోనైనా అందర్నీ కలుపుకొని పోతుంటారు. ఇలా సౌమ్యంగా ఉంటే ఈ టాప్ యాంకర్‌పై అభిమానం కురిపిస్తుంటారు. ఆమె ప్రవర్తన, మాట తీరు టాప్ యాంకర్‌గా కొనసాగడానికి ప్రధాన కారణమని చెప్పుకొంటారు.

పారితోషికం ఎంతంటే..
ఇక టాప్ యాంకర్‌గా దూసుకెళ్తున్న సమ ప్రతీ కార్యక్రమానికి భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటారనేది అందరికీ తెలిసిందే. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో కార్యక్రమానికి సుమ రూ.2.5 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకోంటారని, అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొంటారు.
సరికొత్త కామెడీ సీరియల్‌తో
ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా సుమ షోలకే పరిమితం కాకుండా సరికొత్త కామెడీ సీరియల్‌తో ముందుకు రానున్నది. హౌస్ ఆఫ్ హంగామా అనే సిరియల్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమవుతున్నారు. మార్చి 16 నుంచి ఈ సీరియల్ సోమవారం, శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రముఖ టెలివిజన్ చానెల్‌లో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











