Trinayani : త్రినయని పాత్రకు ఆషికా పదుకొనెకు భారీ రెమ్యునరేషన్ .. ఒక్కరోజుకు ఎంతంటే?
హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఏ భాష అయినా , ఏ ఇండస్ట్రీ అయినా సరే సినిమా తారలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సీరియల్ నటులు. బుల్లితెరపై సూపర్ స్టార్ డమ్‌తో ఏకంగా సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వీరిని నెత్తిన పెట్టుకుంటున్నారు. సీరియల్సే అని తక్కువగా అంచనా వేయడానికి లేదు.. ఇక్కడా రెమ్యునరేషన్ బాగానే గిట్టుబాటు అవుతోంది.
తెలుగులో జీ తెలుగు సీరియల్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. వాటిలో త్రినయని ఇప్పుడు ముందు వరుసలో ఉంది. ఒకానొక దశలో మాటీవీ సీరియల్స్‌తో పోటీపడింది త్రినయని. ఇందులో త్రినయనిగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు ఆషికా పదుకొనె. నిజానికి తెలుగు సీరియల్స్ మొత్తం కన్నడ నటీనటుల హవానే కదా. దానికి తగ్గట్లుగానే ఆషికను కూడా కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు మన తెలుగు బుల్లితెర మేకర్స్. కానీ అందం , అభినయంతో సీరియల్‌ని తన భుజాలపై మోస్తున్నారు ఆషికా.

1995 జూన్ 29న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు ఆషికా పదుకొనె. బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. కన్నడలో పలు హిట్ సీరియల్స్‌లో నటించిన ఆమెకు తెలుగు బుల్లితెరపై మంచి అవకాశాలు వరించాయి. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆషికా పదుకొనె పరిచయమయ్యారు. వీటన్నింటిలో జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అతింద్రీయ శక్తులు, దైవిక శక్తుల మధ్య జరిగే పోరాటం, అత్తారింట్లో కష్టాలు పడే కోడలు ఇలాంటి అంశాలు చుట్టూ త్రినయని సీరియల్ తిరుగుతుంది.
కర్ణాటకకే చెందిన వ్యాపారవేత్త చేతన్ శెట్టితో ప్రేమలో పడిన ఆషికా రంగనాథ్.. పెద్దల అంగీకారంతో అతనిని పెళ్ళాడింది.2020లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట అనంతరం 2021 అక్టోబర్ 18న మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అయితే అప్పట్లో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా తాను సీరియల్స్‌లో నటిస్తానని ఆషికా పదుకొనె ముందు తెలిపారు. అందుకు తగినట్లుగానే కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇదిలాఉండగా.. జీ తెలుగు సీరియల్స్‌కు సంబంధించి స్టార్‌గా వెలుగొందుతున్నారు ఆషికా పదుకొనె. తోటి బుల్లితర నటులు ప్రేమి విశ్వనాథ్, దీపిక రంగరాజులకు ఎంత ఇమేజ్ ఉందో ఆషికాకు అదే స్థాయిలో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఉంది. మరి త్రినయని సీరియల్‌కు గాను ఆషికా పదుకొనెకు పారితోషికంగా ఎంత చెల్లిస్తున్నారనే డిస్కషన్ నడుస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే.. ఆషికకు ఒక్కరోజుకు రూ. 25 వేల చొప్పున రెమ్యునరేషన్ కింద ఇస్తున్నారు. నెలకు ఆమె 25 రోజల పాటు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.. అంటే ఈ లెక్కన రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు అందుకుంటున్నారని బుల్లితెర వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











