Bigg Boss Telugu 9 Prize Money: బిగ్‌బాస్ తెలుగు 9 ప్రైజ్ మనీ ఎంత? 50 లక్షల్లో కంటెస్టెంట్‌కు ఎంత?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకొన్నది. ఇంకా కొద్ది రోజుల్లో జరిగే గ్రాండ్ ఫినాలేకి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఎవరికి ట్రోఫి లభిస్తుంది? టైటిల్ కామన్ మ్యాన్ గెలుస్తాడా? సెలబ్రిటీ గెలుస్తాడా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? అనే విషయం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు ట్రోఫితోపాటు కంటెస్టెంట్‌కు ఏ మేరకు డబ్బులు లభిస్తాయనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 14వ వారం ఊహించని విధంగా నిర్ణయాలు జరిగిపోయాయి. ఫినాలేకు ముందు డబుల్ ఎలిమినేషన్‌తో అభిమానులకు బిగ్‌బాస్ షాకిచ్చాడు. శనివారం రోజున కమెడియన్ సుమన్ శెట్టిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. ఆదివారం రోజున టెలివిజన్ యాక్టర్ భరణి శంకర్‌ను ఎలిమినేట్ చేసి టాప్ 5 కంటెస్టెంట్లను డిసైడ్ చేశాడు. దాంతో టైటిల్ రేసులో ఎవరున్నారనే విషయంపై గేమ్ ఫాలోవర్స్‌కు క్లారిటీ ఇచ్చారు.

Bigg Boss Telugu 9 Prize Money

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో టాప్ 5 కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. టికెట్ టూ ఫినాలే ద్వారా కల్యాణ్ పడాల తొలి ఫైనలిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసే ప్రక్రియలో భాగంగా తనూజను సేఫ్ చేసి రెండో ఫైనలిస్టుగా మార్చాడు. అలాగే మూడో ఫైనలిస్టుగా డీమాన్ పవన్, నాలుగో ఫైనలిస్టుగా ఇమ్మాన్యుయేల్, చివరలో భరణి శంకర్ ఎలిమినేట్ చేయడం ద్వారా సంజనా గల్రానీ 5వ ఫైనలిస్టుగా మారిపోయారు.

ఇక బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. ఎప్పటిలానే ఈ మొత్తాన్ని 50 లక్షల రూపాయల మేర ఫిక్స్ చేశారు. అయితే ఈ మొత్తంలో కంటెస్టెంట్‌‌కు ఎంత లభిస్తుంది? విజేతకు ఏ మేరకు బహుమతిని గెలుచుకొంటాడు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కానీ ఈ మొత్తం ప్రైజ్ మనీలో ఎవరికీ కూడా టోటల్ అమౌంట్ రాదనే విషయం తెలిసిందే.

సాధారణంగా గేమ్ షో, రియాలిటీ షో ప్రైజ్ మనీ విషయంలో పన్ను విధింపు ఉంటుంది. 194BB సెక్షన్ ప్రకారం 30 శాతం పన్ను ఫ్లాట్‌గా విధిస్తారు. ఇంకా సర్ ఛార్జి కలిపి మొత్తంగా 31.2 శాతం పన్ను విధిస్తారు. పన్ను కోత తర్వాతే ఉండే మొత్తాన్ని విజేతకు అందిస్తారు అని గతంలో గెలిచిన వారు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం నుంచి ఇంకా కొంత మేరకు తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదు అని పేర్కొంటున్నారు.

టాక్స్ నిబంధనల మేరకు ఎప్పటిలానే బిగ్‌బాస్ తెలుగు విజేతకు ప్రకటించిన 50 లక్షల రూపాయల నుంచి 31.2 శాతం పన్ను విధిస్తారు. అంటే 50 లక్షల నుంచి సుమారుగా 15.6 లక్షల రూపాయలు మైనస్ అవుతాయి. దాంతో విన్నర్‌కు సుమారుగా 34.4 లక్షల రూపాయలకు అటు ఇటుగా చేతికి అందే అవకాశం ఉంది అని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ తెలిపారు.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 tanuja sanjana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X