Brahmamudi కావ్య పాత్రకు దీపిక రంగరాజు‌కు భారీ రెమ్యునరేషన్.. బ్రహ్మముడికి పారితోషికం ఎంతంటే?

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి. టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ ధారవాహిక అదే రేంజ్‌లో రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అయితే ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకొంటున్న దీపిక రంగరాజు తెలుగు ఆడియెన్స్ నుంచి భారీ పాపులారిటీని సొంతం చేసుకొన్నది. అయితే ఆమె గురించిన వివరాలు, ఆమె రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

దీపిక రంగరాజు వ్యక్తిగత వివరాల్లోకి వస్తే.. తమిళనాడులోని పన్రూతికి చెందిన వారు. ఆమె మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొన్నారు. కాలేజీ స్థాయిలోనే ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకొన్నారు. ఆ తర్వాత తమిళంలో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ఆరంభించారు.

How Much Deepika Rangaraju gets remuneration for Brahmamudi Serial

చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సీరియల్‌కు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది. దాంతో ఆ సీరియల్‌లో వర్క్ చేసిన దీపిక రంగరాజుకు మంచి పేరు లభించింది. ఆ సీరియల్ తర్వాత తెలుగులో బ్రహ్మముడి సీరియల్‌తో అడుగుపెట్టారు.

కావ్య పాత్రలో దీపిక రంగరాజు కనిపించిన బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది సమయంలోనే భారీ స్పందన ఆడియెన్స్ నుంచి వచ్చింది. దాంతో తెలుగులో కూడా దీపికకు పెద్ద స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. దాంతో ప్రేమ విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకొనే ప్రయత్నంలో ఉన్నారు.

How Much Deepika Rangaraju gets remuneration for Brahmamudi Serial

ఇక బ్రహ్మముడి సీరియల్‌లో నటిస్తున్న దీపిక రంగరాజకు భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. ఈ సీరియల్‌లో నటించిన ఆమెకు పెద్ద మొత్తమే ముడుతుందని టీవీ వర్గాలు వెల్లడించాయి. ఆమెకు ప్రతీ రోజు సుమారుగా 25 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇలా సుమారుగా 25 రోజులపాటు షూటింగ్ చేస్తారు. దాంతో ఓ నెలకు సుమారుగా 7 నుంచి 10 లక్షలు సంపాదిస్తారని చెప్పుకొంటున్నారు.

ఇదిలా ఉండగా, తమిళ, తెలుగు రంగంలో రాణిస్తున్న దీపిక రంగరాజు.. తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. మంచి పాత్రలు లభిస్తే.. సినిమా రంగంలో కూడా రాణించేందుకు ఎదురు చూస్తన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X