Brahmamudi బ్రహ్మముడిలో స్వప్న పాత్రకు హమీదా ఖాతూన్‌కు టాప్ రెమ్యునరేషన్..బిగ్‌బాస్ బ్యూటీకి పారితోషికం ఎంతంటే

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకొన్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్‌లో మానస్ నాగులపల్లి, దీపిక రంగనాథ్, నైనిషా రాయ్, కిరణ్ కాంత్, సుప్రియ శ్రీకర్, హమీదా ఖాతూన్ లాంటి నటీనటులు తమ పాత్రలు పోషించారు. అయితే బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హమీదా ఖాతూన్ ఈ సీరియల్‌లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమెకు ఈ సీరియల్ నిర్మాత చెల్లిస్తున్న రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

హమీదా ఖాతూన్ విషయానికి వస్తే.. కోల్‌కతాలో జన్మించిన ఈ అందాల భామ మోడల్‌గా రాణించింది. హైదరాబాద్‌కు వచ్చిన ఈమె సాహసం చేయరా ఢింబకా అనే తెలుగు సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కాదల్ మాటట్టమ్ వేనీ అనే తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

How Much Hamida Khatoon gets remuneration for Brahmamudi Serial

అయితే తెలుగు, తమిళ సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఒక్కసారి బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగుపెట్టిన తర్వాత హమీదా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 2021 సంవత్సరంలో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు 5 తనకంటూ ఇమేజ్‌ను, అభిమానులను సంపాదించుకొన్నది.

How Much Hamida Khatoon gets remuneration for Brahmamudi Serial

ఇక తెలుగు సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే టెలివిజన్ రంగంలో ఆఫర్లను ఒడిసిపట్టుకొన్నది. తెలుగు భాష నేర్చుకొని తెలుగు అమ్మాయి అనే ఇమేజ్ సంపాదించుకొన్నది. ఇక టాప్ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడిలో స్వప్న అనే ఇంపార్టెంట్ రోల్‌ను పోషిస్తున్నది. హీరోయిన్‌కు సమాంతరంగా సాగే పాత్రలో తన ప్రతిభను చాటుకొంటున్నది.

How Much Hamida Khatoon gets remuneration for Brahmamudi Serial

బ్రహ్మముడి సీరియల్‌లోని స్వప్న పాత్రలో నటించినందుకు గాను.. భారీ పారితోషికాన్ని అందుకొంటున్నారు. ఈ సీరియల్‌లో యాక్టింగ్ చేసినందుకు ఆమెకు ప్రతీ రోజు 10 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. అయితే నెలలో సీరియల్ యాక్టర్‌కు సుమారుగా 20 నుంచి 25 వరకు షూటింగ్ ఉంటుంది. హమీదా దాదాపు నెలకు సుమారుగా 20 రోజులు పనిచేస్తుందని తెలిసింది.

How Much Hamida Khatoon gets remuneration for Brahmamudi Serial

ఇక బ్రహ్మముడి సీరియల్‌లో 20 నుంచి 25 రోజుల పనిచేయడం ద్వారా ఆమె నెలకు 250000 సంపాదిస్తున్నారని, అంతేకాకుండా టెలివిజన్‌లో రియాలిటీ షోలు, అలాగే ఇతర కార్యక్రమంలో అదనంగా భారీగానే సంపాదిస్తున్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. బిగ్‌బాస్ మాత్రం హమీదాకు మంచి కెరీర్ సంపాదించిపెట్టిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X