Karthika Deepam డాక్టర్ బాబుకు భారీ రెమ్యునరేషన్.. కార్తీకదీపంలో నిరుపమ్‌కు పారితోషికం ఎంతంటే?
తెలుగు టెలివిజన్ సీరియల్స్ రంగంలో స్టార్ యాక్టర్లలో నిరుపమ్ పరిటాల టాప్‌లో ఉంటారంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెర మీద శోభన్ బాబు ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న డాక్టర్ బాబు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నటించిన కార్తీకదీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను సుదీర్ఘకాలంగా కొత్త అనుభూతిని కలిగించింది. అలాంటి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌కు తాజాగా సీక్వెల్ వచ్చింది. కార్తీకదీపం 2 సీరియల్‌లో నటించినందుకు గాను ఆయన అందుకొంటున్న రెమ్యునరేషన్ ఎంతనే వివరాల్లోకి వెళితే..
నటుడు, మాటల రచయిత ఓంకార్ కుమారుడిగా సుపరిచితులైన నిరుపమ్ పరిటాల.. ఆయన పేరు కంటే కార్తీక్‌గా, లేదా డాక్టర్ బాబుగా అత్యంత పాపులారిటీని తన నటనతో సొంతం చేసుకొన్నాడు. ఈటీవీలో ఆయన చంద్రముఖి అనే సీరియల్ ద్వారా తెలుగు వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బుల్లితెర మీద వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశమే రాలేదు.

చంద్రముఖి సీరియల్ తర్వాత వరుసగా సీరియల్స్ అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. బ్రహ్మము8డి, హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, కార్తీకదీపం, అత్తారింటికి దారేది? కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవేరా ప్రాణం తదితర సీరియల్స్ నటించారు.
తెలుగు బుల్లితెర మీద కార్తీకదీపం బ్లాక్ బస్టర్ కావడంతో కార్తీక్‌గా నిరుపమ్ ప్రతీ ఇంటి గడపను టచ్ చేశారు. తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానాన్ని, ఆదరణను సొంతం చేసుకొన్నాడు. ఆయన నటించిన సీరియల్స్ టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడం చూస్తే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్దం అవుతుంది.

ఇక బుల్లితెరకే పరిమితం కాకుండా ఛాన్స్ దొరికితే.. సమయం ఉంటే సినిమాల్లో కూడా నటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఓటీటీలో వచ్చిన కుమారి శ్రీమతి సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇంకా పలు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించారు.
ఇదిలా ఉంటే.. కార్తీకదీపం సీరియల్ భారీ హిట్ తర్వాత మరోసారి అదే పాత్రలో నిరుపమ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కార్తీకదీపం సీరియల్ 2 - నవవసంతం సీరియల్‌లో నటించినందుకు గాను భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నారనేది టెలివిజన్ వర్గాల సమాచారం. ఈ సీరియల్‌లో గానీ, ఇతర సీరియల్‌లో ఆయన నటించినందుకు ప్రతీ రోజు 40 వేల రూపాయలు రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం.
నిరుపమ్ విషయానికి వస్తే.. ఇక ప్రతీ నెలలో సుమారుగా 25 రోజులపాటు షూట్స్‌కు హాజరవుతారు. దాంతో ఆయన ఒక నెలలో 9 నుంచి 10 లక్షలకుపైగానే పారితోషికాన్ని అందుకొంటారు అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో భారీ పారితోషికాన్ని అందుకొంటున్న యాక్టర్లలో నిరుపమ్ పరిటాల ఒకరిగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications










