Bigg Boss Telugu 7: కార్నర్ చేస్తే కామ్ అవుతాడా.. కప్పు కొట్టుకుని వెళ్తాడా.. హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీ పెంచుకుంటూ... అందరి చేత ఆహా అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి అందరికీ అద్భుతమైన థ్రిల్ ను ఇస్తోంది. అయితే మొదటి వారంలోనే కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన హీరో శివాజి గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఆటతో అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు.
అమర్ దీప్ తో పాటు హౌస్ మేట్స్ అందరూ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేయడం.. అదే సమయంలో శివాజి అతడికి అండగా నిలబడడం అతనికి బాగా ప్లస్ అయింది. అయితే ఎంతో అనుభవం ఉన్న శివాజి.. తన గేమ్ స్ట్రాటెజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన వాటికి పైఎత్తులు వేస్తూ చిత్తు చేస్తున్నారు. వయసులోనే కాకుండా అనుభవంలో కూడా పెద్ద వాడైన శివాజికి అన్నీ కలిసొస్తున్నాయి. రెండో వారం తర్వాత నుంచి ఫ్యామిలీ వీక్ వచ్చే వరకూ అంతా ఈయనే విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు.
Recommended Video


కానీ ఈ మధ్య అమర్ దీప్ గేమ్ చక్కగా ఆడడం, ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి సీరియల్ బ్యాచ్ వాళ్లతో పెద్దగా కలవకపోవడంతో కాస్త పాజిటివిటీ వచ్చింది. అందులోనూ ఆయన కెప్టెన్సీ కోసం పోటీ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఇక చివరి రెండు వారాల్లో ఫైనల్ కంటెండర్ గా నిలిచి ఆయన విన్ అవ్వకపోవడంతో... మరింత సింపథీ వచ్చేసింది. ఈక్రమంలోనే శివాజికి బాగా నెగిటివిటీ వచ్చింది. అయితే ఎలాగైనా సీరియల్ బ్యాచ్ ను గెలిపించాలనుకున్న బిగ్ బాస్ కు అది కనిపించడంతో శివాజి నెగిటివ్ పుటేజీని ఎక్కువగా చూపించారు.
ఈక్రమంలోనే ఇంట్లోని వాళ్లంతా కలిసి 13వ వారం నామినేషన్స్ లో భాగంగా ఆయనపై పడ్డారు. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, అంబటి అర్జున్ లు శివాజిని నామినేట్ చేశారు. తమలోని ఉన్న పాయింట్లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ.. శివాజికి షాకిచ్చారు. అయితే అంతా కలిసి శివాజిని కార్నర్ చేయగా... మరి ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అందులోనూ గౌతమ్ తో జరిగిన వార్ లో శివాజి... ఇక నుంచి పల్లవి ప్రశాంత్, యావర్ ల విషయంలో తలదూర్చనని చెప్పాడు. ఇక ఒంటరిగానే ఇంట్లో శివాజి గేమ్ ఆడబోతున్నాడని తెలుస్తోంది.

ముఖ్యంగా ఎప్పుడూ మైండ్ గేమ్ ను మార్చే శివాజి.. ఇప్పుడు సింపథీ కోసం ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతంది. ఇప్పటికే 12వ వారంలో చేయి నొప్పి తట్టుకోలేకపోతున్నాను, వెళ్లిపోతాను, గేమ్ ఆడకుండా కప్పు కొట్టడం ఇష్టం లేదంటూ... సింపథీ గెయిన్ చేసే ప్లాన్ వేశాడు. మరి అంతా కలిసి కార్నర్ చేస్తే.. శివాజి ఎలా రియాక్ట్ అవుతాడు, గేమ్ ఎలా ఆడతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కువ శాతం సింపథీ గెయిన్ చేసే యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











