Bigg Boss Telugu 6 కంటెస్టెంట్ కావాలనుకొంటున్నారా? ఇలా చేస్తే.. మీరు బిగ్‌బాస్ ఇంటిలోకి.. !
ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు ఓటీటీ సీజన్ వన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అంతే అట్టహాసంగా పూర్తయింది. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిందుమాధవి ఫైనలిస్ట్ గా నిలిచి కప్ కూడా గెలుచుకున్నారు. అయితే ఈ ఫినాలే రోజు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా త్వరలోనే ఉంటుందని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా యాంకర్ శివ లాంటివాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది అనే విధంగా హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా కామన్ మ్యాన్స్ కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ యాజమాన్యం దీనికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సీజన్ 6 లో కామన్ మ్యాన్స్
తెలుగులో బిగ్ బాస్ షో కి లభించినంత క్రేజ్ మరే షోకి లభించలేదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ 2 నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత సీజన్ 3 నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్ లో కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఎట్టకేలకు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సమయం ఆసన్నమైంది. ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్స్ పాల్గొనే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

స్టార్ మా వారి వెబ్ సైట్ లో కి
అయితే ఇప్పుడు అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన కామన్ మ్యాన్స్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో నాగార్జున మాట్లాడుతూ ఈ బిగ్ బాస్ షోలో సామాన్యులకు ఆహ్వానం అంటూ పేర్కొన్నారు. ఇన్నాళ్లు మీరు ఇంట్లో ఉండి బిగ్ బాస్ షోని చూసి ఆనందించారు కదా, ఇప్పుడు మీరే హౌస్ లోపలికి వెళ్లి గేమ్ ఆడే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అంటూ నాగార్జున ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే స్టార్ మా మీకు అందిస్తోంది వన్ టైం గోల్డెన్ ఛాన్స్. అందుకే టికెట్ టు బిగ్బాస్ సీజన్ 6 అందుకోండి అని చెబుతూ మరిన్ని వివరాల కోసం స్టార్ మా వారి వెబ్ సైట్ లో కి లాగిన్ అవ్వాలిసిందిగా నాగార్జున కోరారు.

ముందుగా పేరు
ఇక బిగ్ బాస్ వారి వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ముందుగా పేరు, జెండర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పుట్టిన తేదీ, ఏ సిటీలో నివసిస్తున్నారు అలాగే నివసిస్తున్న వారి అడ్రస్ వివరాలు కూడా మెన్షన్ చేయాల్సిందిగా కోరారు. ఇక ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత ఒక ఎమర్జెన్సీ నెంబర్, ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భారత దేశస్తులా? కాదా అనే వివరాలు ఇచ్చి ఏం చదువుతున్నారు అనే వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ముందుగా పేరు
ఇక బిగ్ బాస్ వారి వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ముందుగా పేరు, జెండర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పుట్టిన తేదీ, ఏ సిటీలో నివసిస్తున్నారు అలాగే నివసిస్తున్న వారి అడ్రస్ వివరాలు కూడా మెన్షన్ చేయాల్సిందిగా కోరారు. ఇక ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత ఒక ఎమర్జెన్సీ నెంబర్, ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భారత దేశస్తులా? కాదా అనే వివరాలు ఇచ్చి ఏం చదువుతున్నారు అనే వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

క్లుప్తంగా కొన్ని విషయాలు
అలాగే అప్లై చేసుకున్న వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలుగు మాట్లాడతారా వేరే భాష మాట్లాడతారా అనే విషయాలు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు బిగ్ బాస్ యాజమాన్యానికి అర్థం అయ్యే విధంగా చెప్పాలి.

అనర్హులుగా ప్రకటించబడతారు
తర్వాత మూడు నిమిషాల నిడివి గల ఒక ఆడిషన్ వీడియో సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ మూడు నిమిషాల నిడివి గల వీడియో మూడు నిమిషాలు దాటినా 50 ఎంబీ సైజు మించినా సరే పోటీలో అనర్హులుగా ప్రకటించబడతారు అని బిగ్ బాస్ యాజమాన్యం పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా బిగ్ బాస్ లో పాల్గొనాలి అనే కోరిక ఉంటే వెంటనే ట్రై చేయండి మరి.


Click it and Unblock the Notifications











