twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 4 భారీ బడ్జెట్.. ఎండ్ అయ్యే వరకు తడిసి మోపెడయ్యలే ఉంది.. ఐపీఎల్ ఎఫెక్ట్?

    |

    బిగ్ బాస్ షో స్టార్ట్ చేయడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నెవర్ బిఫోర్ అనేలా జాగ్రత్తలు తీసుకుంటూ షోని చాలా జాగ్రత్తగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే సెట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే హోస్ట్ నాగార్జున నుంచి అద్భుతమైన ప్రోమో కూడా రాబోతోంది. అయితే సెట్ కోసం మునుపెన్నడు లేనంతగా భారీ బడ్జెట్ తో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారి జాగ్రత్తలు తీసుకున్న విధానం చూస్తుంటే షో ఎండ్ అయ్యే వరకు తడిసిమోపెడు అయ్యేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

    Recommended Video

    Bigg Boss 4 Telugu Official Announcement,Contestants List Goes Viral || Oneindia Telugu
     టాప్ యాంకర్స్ తో పాటు హాట్ హీరోయిన్స్..

    టాప్ యాంకర్స్ తో పాటు హాట్ హీరోయిన్స్..

    ఆగస్టు చివరలోనే బిగ్ బాస్ షో మొదలు కానున్నట్లు టాక్ వచ్చిన విషయంలో తెలిసిందే. ఇక కంటెస్టెంట్స్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. టాప్ యాంకర్స్ తో పాటు హాట్ హీరోయిన్స్ కూడా హౌజ్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 15మంది లోపే కంటెస్టెంట్స్ గా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

    పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే..

    పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే..


    ఇక బిగ్ బాస్ షో ముందు ఉన్న అసలైన ఛాలెంజ్ కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండడం. ముందయితే షోలోకి అడుగు పెట్టెబోయే వారికి కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న తరువాతనే షోలోకి అడుగుపెట్టనున్నారు. ఇక సెట్ కోసం ఈ సారి తీసుకున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. బడ్జెట్ భారీ స్థాయిలో ఉందని సమాచారం.

    సెట్ కోసం భారీ ఖర్చులు

    సెట్ కోసం భారీ ఖర్చులు


    మెయిన్ గా సెట్ కోసమే 4 నుంచి 5కోట్ల మధ్యలో ఖర్చు అయినట్లు తెలుస్తోంది. టెక్నీకల్ గా కూడా హౌజ్ లో ఖరీదైన వస్తువులను ఏర్పాటు చేసినట్లు టాక్. ఇక కంటెస్టెంట్స్ కి ఈసారి పేమెంట్స్ కూడా గట్టిగానే అందనున్నాయని తెలుస్తోంది. డబుల్ పేమెంట్స్ ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. మెయిన్ గా యాంకర్స్ ఈ షో ద్వారా భారీ ఆదాయాన్ని కూడబెట్టుకోనున్నారు.

    తడిసి మోపెడు..?

    తడిసి మోపెడు..?

    ఇక షోకి రేటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గాని షో ముగిసే వరకు నిర్వాహకులు వేసుకున్న ప్లాన్ వల్ల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున 60ఏళ్ళ వయసులో కరోనాతో రిస్క్ చేస్తున్నాడు అనే కథనాలు ఎక్కువవుతున్నాయి. కానీ ఆయన కోసం కూడా జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. మరోవైపు రెమ్యునరేషన్ కూడా డబుల్ అయినట్లు సమాచారం.

    ఐపీఎల్ ఎఫెక్ట్?

    ఐపీఎల్ ఎఫెక్ట్?


    బిగ్ బాస్ షో ఆగస్టు చివరి వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 8వరకు కొనసాగనుంది. ఇక 105రోజుల నుంచి 115 రోజుల వరకు కొనసాగే బిగ్ బాస్ కి ఎంతో కొంత ఐపీఎల్ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. దాదాపు రెండు కూడా ఒకే సమయాల్లో టెలిక్యాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రేటింగ్స్ ఇబ్బందులు తప్పవనే టాక్ వస్తోంది.

    English summary
    This corona virus effect seems to be bothering the film industry most. The shooting halts on the spot, affecting the lives of many cinema workers. The government has given the green signal that the shootings could be held from June after the lockdown. However, there is a possibility that Bigg Boss 4 will also start in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X