తేజస్వికి అన్యాయం.. బిగ్‌బాస్ నాశనం కాను.. తిరుగుబోతు అంటారా? నెటిజన్ల శాపనార్థాలు

By Rajababu

బిగ్‌బాస్ నుంచి తేజస్వి మదివాడ ఎలిమినేషన్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. కొందరు తేజస్వికి మద్దతు పలుకుతుండగా, మరొకందరు ద్వేషిస్తున్నారు. తేజస్వి బిగ్‌బాస్ నుంచి బయటకు రావడం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. పలువురు నెటిజన్లు తమ వాదనతో హోరెత్తిస్తున్నారు. తేజస్వికి మద్దతుగా ఎలాంటి ట్వీట్లు చేస్తున్నారో మీరే చూడండి..

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tejaswi Gets Bad Comments In Social Media
చెత్త ఎపిసోడ్‌తో ఎలిమినేషనా?

చెత్త ఎపిసోడ్‌తో ఎలిమినేషనా?

ఒక గంట చెత్త ఎపిసోడ్‌తో ఓ అమ్మాయిపై అప్పుడే నిర్ణయానికి రావొద్దు. ఇలాంటి అంశాలే అమ్మాయికి మరింత బలాన్ని ఇస్తాయి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. తేజస్వికి అండగా నిలిచారు.

ఒకరిని ప్రేమిస్తే తప్పా?

ఒకరిని ప్రేమిస్తే తప్పా?

ఫ్రెండ్‌షిప్ ఉంటే తప్పా? అమ్మాయి, అబ్బాయి మధ్య రిలేషన్ ఉంటే నేరమా? ఒకరిపై ఫీలింగ్ ఉంటే తప్పేమి కాదు అని తేజూకి మరో వ్యక్తి అండగా నిలిచిచారు.

 మీ షో భ్రష్టుపట్టడం ఖాయం

మీ షో భ్రష్టుపట్టడం ఖాయం

తేజస్వి మదివాడను బిగ్‌బాస్ నుంచి పంపించి నాని, స్టార్ మా చెత్త నిర్ణయం తీసుకొన్నారు. కొద్దివారాల్లో మీ షో ఎలా భ్రష్టుపట్టిపోతుందో చూడండి.. ఈ వారం తేజస్విని ఎలిమినేట్ చేయడం తప్పని మీరు అంగీకరించక తప్పదు. మీది తప్పుడు వ్యూహం అని తెలుసుకొంటారు అని మరో నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ద్వేషిస్తారు.. లైట్ తీస్కో

ద్వేషిస్తారు.. లైట్ తీస్కో

ప్రతీ అందమైన అమ్మాయి, ప్రతిభ ఉన్న మహిళను ద్వేషించే వాళ్లు ఉండటం కొత్తకాదు. తేజూ నీవు అద్భుతమైన అమ్మాయివి. ద్వేషించే వాళ్లు ద్వేషిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకు అని మరొకరు ట్వీట్ చేశారు.

తిరుగుబోతు అంటారా?

తిరుగుబోతు అంటారా?

తేజస్వి బిగ్‌బాస్ అవుట్ కావడం అనేది సమస్య కాదు. పురుషులకు, మహిళలకు లింగ సమానత్వం ఉండాలి. తేజస్వి లాగా మగాడు ప్రవర్తిస్తే అతడిని అర్జున్ రెడ్డి అంటారు. అదే అమ్మాయి చేస్తే ఆమెను తిరుగుబోతుగా ముద్ర వేస్తారా?. తేజస్వి అమ్మాయి కావడం వల్లనే అన్యాయం జరిగింది అని ఓ నెటిజన్ నిలదీశాడు.

క్వీన్‌లా బయటకు వచ్చారు

క్వీన్‌లా బయటకు వచ్చారు

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిందేదో జరిగింది. కానీ ఆమె ఓ క్వీన్‌లా బయటకు వచ్చింది. సొంత కాళ్లపై నిలబడిన తేజస్వి అంటే మగాళ్లకు చులకన. పనికి రాని వాళ్లంతా ఆమెను చెడుగానే చూస్తారు. ట్రోలర్స్‌ను పట్టించుకోకుండా నీకెంతో మంది మద్దతు తెలుపుతున్న ఫాలోవర్స్‌ ఉన్నందుకు గర్వంగా ఫీల్ కావాలి అని మరొకరు ట్వీట్ చేశారు.

పోరాటం చేస్తున్న తేజస్వి

పోరాటం చేస్తున్న తేజస్వి

తేజస్వి తన కలలను సాకారం చేసుకొనేందుకు పోరాటం చేస్తున్న ఓ అమ్మాయి. అలాంటి అమ్మాయికి సోకాల్డ్ కౌశల్ ఆర్మీ మద్దతు తెలుపకపోగా అసభ్యంగా దూషించారు. అది నామినేషన్ రౌండ్ కానీ, ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ, రెగ్యులర్ ఎపిసోడ్ కానీ నీ గురించే చర్చ జరుగుతున్నది అని మరో అభిమాని తన గళాన్ని వినిపించారు.

అండగా నిలిచారు.. థ్యాంక్స్

అండగా నిలిచారు.. థ్యాంక్స్

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తనకు అభిమానుల నుంచి మద్దతు లభిస్తున్న తీరుపై తేజస్వి ట్విట్టర్‌లో సంతోషాన్ని వ్యక్తం చేసింది. #WeStandWithTejaswi నన్ను ఇంకా లైవ్‌గా ఉంచినందుకు థ్యాంక్యూ. నాలో ఇంకా మంచిని చూస్తున్నందుకు హ్యాపీ. మీరు ఇస్తున్న సపోర్టుకు ఆనందభాష్పాలు కారుతున్నాయి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X