మైగాడ్.. బిగ్ బాస్ హౌస్‌లో విషాదం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న కౌశల్, గణేష్.. అసలేం జరిగింది!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంటి సభ్యులంతా హుషారుగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఆడియన్స్ కి వినోదాన్ని అందించే కొత్త కొత్త టాస్క్ లు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మహిళలు, పురుషుల మధ్య అంతిమ యుద్ధం అనే టాస్క్ సాగుతోంది. ఈ టాస్క్ నిన్నంతా హుషారుగా సాగింది. నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల చేశారు. ఓ ప్రోమోలో అంతా కబడ్డీ ఆడుతూ సరదాగా గడుపుతుంటే, మరో ప్రోమోలో అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏంజరిగిందనే ఉత్కంఠ నెలకొని ఉంది.

అంతిమ యుద్ధం
నిన్న ప్రారంభమైన అంతిమ యుద్ధం టాస్క్ నేడు కూడా కొనసాగనుంది. మహిళలకు సంబందించిన ప్రదేశం నుంచి పురుషులు ఏమైనా తీసుకోవాలనుంటే నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదే నిబంధన మహిళలకు కూడా వర్తిస్తుంది.

ఎప్పటిలాగే
హౌస్ లో ఎప్పటిలాగే కౌశల్ డామినేట్ చేస్తున్నాడు. అధిక మొత్తంలో నాణేలు అతడి వద్దే ఉంచుకున్నాడు. కౌశల్ విషయంలో ఇంటి సభ్యులు చేసేది ఏమీ లేక ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. చాలా సరదాగా ఈ టాస్క్ జరుగుతోంది.
కబడ్డీ మ్యాచ్
నేడు జరగబోయే ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు మహిళల జట్టు, పురుషుల జట్టుగా విడిపోయి కబడ్డీ మ్యాచ్ ఆడనున్నారు. ఎవరు పైచేయి సాధించారో నేడు తేలనుంది. పురుషుల తరుపున కౌశల్, అమిత్, సామ్రాట్, గణేష్ పాల్గొంటున్నారు. మహిళల తరుపున గీత, శ్యామల, దీప్తి, పూజ పాల్గొంటున్నారు.

ఉన్నట్లుండి ఏమైంది
సరదాగా గడుపుతున్న ఇంటి సభ్యులకు ఏమైంది. అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు. అంతా ఒకే దగ్గర కూర్చుని దీనంగా ఉన్నారు. హౌస్ లో ఎం జరిగిందో అంతుచిక్కని పరిస్థితి.
వెక్కి వెక్కి ఏడుపు
కౌశల్, రోల్ రైడ, గణేష్ అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ప్రోమోలో కనిపిస్తున్నాయి. పూజ కూడా తల పట్టుకుని విషాదంలో మునిగిపోయి ఉంది. ఇంత విషాదానికి కారణం ఏమిటో నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.


Click it and Unblock the Notifications











