పరువాలతో మాయ చేస్తున్న హైదరాబాద్ బ్యూటి.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న నెటిజన్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరోయిన్ ను చూసిన పక్కరాష్ట్రం నుంచి వచ్చిన వారే ఉంటారు. ఇదే విషయాన్ని మొన్న బేబి అభినందన సభలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం చెప్పారు. సినిమాల్లోకి తెలుగు అమ్మాయిలు రావట్లేదని చెప్పుకొచ్చారు. అయితే అందం, అభినయం అన్ని ఉన్నా కలిసి రాని తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ నందిని రాయ్ ఒకరు. తన గ్లామర్ తో సినిమాల్లో అలరించిన ఈ సుందరాంగీ తాజాగా సోషల్ మీడియాలో పరువాల వడ్డన చేసింది. దీంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలపై లుక్కేస్తే..
మిస్ ఆంధ్రా టైటిల్: హైదరాబాద్ కు చెందిన ముద్దుగుమ్మ నందినీ రాయ్ బిగ్ బాస్ షో ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ కంటే ముందుగా ఈ బ్యూటి మోడలింగ్ రంగంలో బాగా రాణించింది. తన అందచందాలతో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో ఆఫర్లను అందుకుంది.

అక్కడే తొలిసారిగా: పేరుకు నందిని రాయ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా నార్త్‌లోనే అధికంగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా అవకాశం అందుకుంది. 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ గ్లామరస్ బ్యూటి ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించింది.
కొంతమేర పేరు: తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా నందిని రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో మంచి ఆట, ఘాటు లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయింది. అయితే దీని ద్వారా ఆమె కొంతమేర తెలుగు ప్రజల్లో పేరు తెచ్చుకోలిగింది.

సినిమాలు-సిరీసులు: బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్‌లో భారీగా ఆఫర్లు వస్తాయని ఆశపడిన నందిని రాయ్ కు ఊహించని విధంగా నిరాశ ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్నది 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేయాల్సి వచ్చింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్', గాలి వాన వెబ్ సిరీస్‌లలో మంచి పాత్రలతో ఆకట్టుకుంది. ఇలా చిన్న సినిమాల్లోనూ, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.
పర్ఫెక్ట్ ఫిజిక్: పర్ఫెక్ట్ ఫిజిక్, అట్రాక్టివ్ లుక్స్ ఉన్న నందిని రాయ్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె తాజాగా నటించిన భాగ్ సాలే సినిమా థియేర్లలో విడుదలైన ప్రేక్షకుల స్పందన పెద్దగా దక్కలేదు. కానీ, ఆమె పాత్ర ఇంకాస్తా ఎక్కువగా ఉంటే బాగుండేది అని సోషల్ మీడియాలో మీమ్స్ అయితే దర్శనం ఇచ్చాయి.

గ్లామర్ పిక్స్: zఅప్పుడప్పుడు సినిమాలతో సందడి చేసే నందిని రాయ్ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న నందిని రాయ్ తన ఉప్పొంగే పరువాలను కొంటెగా చూపించింది. కూర్చుని వయ్యారంగా ఇచ్చిన నందిని రాయ్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కాగా నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అందుకే అదోలా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











