Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా హైదరాబాద్ యూట్యూబర్? ఎవరీ కిర్రాక్ ఖాలా?
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ హిందీ.. 18 సీజన్లను పూర్తి చేసుకుని 19వ ఎపిసోడ్‌కు సిద్ధమైంది. ఈసారి షెడ్యూల్ కంటే ముందే ఈ మెగా షో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయట చక్కర్లు కొడుతోంది. వెండితెర, బుల్లితెరకు చెందిన సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వివాదాస్పద వ్యక్తులతో తాజా సీజన్ ప్రారంభం కానందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంటెస్టెంట్స్ జాబితాలో మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కూడా స్థానం సంపాదించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ముందుగానే స్ట్రీమింగ్‌లోకి బిగ్‌బాస్ 19
ప్రతి ఏడాది బిగ్‌బాస్ హిందీ ఓటీటీ టెలికాస్ట్ అయ్యాక టీవీ బిగ్‌బాస్ ప్రసారమయ్యేది. ఆగస్ట్ చివరి నాటికి ఓటీటీ సీజన్ పూర్తయితే అక్టోబర్ నుంచి టీవీ బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈసారి అనివార్య కారణాలతో బిగ్‌బాస్ హిందీ ఓటీటీ టెలికాస్ట్ కావడం లేదని నిర్వాహకులు తెలిపారు. దాంతో టీవీ బిగ్‌బాస్ కాస్త ముందుకు జరిగింది. నిర్మాణ సంస్థ, ప్రసారదారుకు మధ్య జరిగిన ఒప్పందంలోవ వివాదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్‌లను సమన్వయం చేసుకుంటూ ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని క్లారిటీ వచ్చేసింది.

ఆగస్ట్ 3 నుంచి బిగ్‌బాస్ హిందీ 19?
నిజానికి బిగ్‌బాస్ 16 సీజన్‌ను పొడిగిస్తూ గతంలో నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు తన ప్రాణాలకు ముప్పు, భద్రతాపరమైన కారణాలతో సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. కట్ చేస్తే ఇవేవీ నిజం కాదని, ఎప్పటిలాగే సల్మాన్ ఖానే హెస్టింగ్ బాధ్యతలు చేపడతారని క్లారిటీ వచ్చింది. అన్ని లెక్కలు సరిచూసుకుని ఆగస్ట్ 3 నుంచి బిగ్‌బాస్ హిందీ 19 స్ట్రీమింగ్ కానుంది గాసిప్స్ వైరల్ అయ్యాయి.
కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్‌బాస్ హిందీ 19 కంటెస్టెంట్స్‌గా 14 మందితో కూడిన ఈ లిస్ట్ చూస్తే.. అలీషా పనన్వార్, రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, కృష్ణ ష్రాఫ్, ఫ్లయింగ్ బీస్ట్, మున్‌మున్ దత్తా, కనికా మన్, ఫైసల్ షేక్, అపూర్వ ముఖర్జీయా, డైసీ షా, ఖుషీ దూబే, రామ్ కపూర్, అరిష్ఫా ఖాన్, గౌతమీ కపూర్ సెలెక్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా హిందీ బిగ్‌బాస్‌కు హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ ఒకరు కంటెస్టెంట్‌గా ఎంపికైనట్లుగా కథనాలు వస్తున్నాయి.
ఫన్నీ వీడియోలతో ప్రియారెడ్డి పాపులర్
హైదరాబాద్‌కు చెందిన ప్రియా రెడ్డి అలియాస్ కిరాక్ ఖాలాను బిగ్‌బాస్ 19లో కంటెస్టెంట్‌గా నిర్వాహకులు ఆహ్వానించారని, ఈ మేరకు చర్చలు జరిగాయట. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియ కన్ఫర్మ్ చేశారు. బిగ్‌బాస్ హిందీ 19 నిర్వాహకులు తనను కలిశారని.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రేక్షకులు నన్ను హౌస్‌లో చూడొచ్చని ఆమె అన్నారు. కిర్రాక్ ఖాలా ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియా స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ ఛానెల్‌కు 93.9k సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాదు ప్రియా రెడ్డి టిక్‌టాక్ ఛానెల్‌కు 200k ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లుగా వార్తలు రావడంతో ప్రియ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రియా రెడ్డి అలియాస్ కిర్రాక్ ఖాలాను హిందీ బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తామో లేదో తెలియాలంటే ఆగస్ట్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











