Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
శిఖా చౌదరి కాల్ డేటాలో ప్రముఖ క్రికెటర్, జయరాం హత్య ముందు రోజు...
ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్యకేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి వ్యవహారం ముందు నుంచీ చర్చనీయాంశం అవుతోంది. తాజాగా శిఖా చౌదరి కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె కాల్ డేటా పరిశీలించిన నందిగామ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఓ యువ క్రికెటర్ నుంచి ఆమెకు తరచూ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఐపీఎల్, రంజీల్లో ఆడిన ఈ క్రికెటర్‌తో శిఖా చౌదరికి చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
తరచూ శిఖా చౌదరి విల్లాకు క్రికెటర్
హైదరాబాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్ సమీపంలో వద్ద ఉన్న శిఖా చౌదరి విల్లాకు తరచూ ఈ క్రికెటర్ వచ్చేవాడని, రోజుల తరబడి అతడు శిఖా చౌదరితో ఉన్నట్లు చుట్టుపక్కల వారి దృష్టికి వచ్చినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమెతో ఎలాంటి రిలేషన్?
పోలీసులు సదరు క్రికెటర్‌ను సంప్రదించగా ఆమెతో కేవలం ఫ్రెండ్సిప్ మాత్రమే ఉందని, ఆమె విల్లాలో పార్టీలు జరిగినపుడు తాను వెళుతూ ఉండేవాడినని, శిఖాతో పరిచయం ఉన్నమాట నిజమే కానీ ఇతర రిలేషన్ ఏమీ లేదని అతడు చెప్పినట్లు సమాచారం.
క్రికెటర్ వెళ్లిన తర్వాత శిఖా ఇంటికి జయరాం
జయరాం హత్య జరిగిన ముందు రోజు కూడా ఈ క్రికెటర్ విల్లాలో శిఖా చౌదరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రికెటర్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాతే చిగురుపాటి జయరాం ఆమె ఇంటికి రావడం, రాత్రి 7.30 గంటల వరకు ఉండటం, ఆ తర్వాత స్వయంగా శిఖా చౌదరి తన డ్రైవర్‌తో జయరాంను పంపినట్లు, మరుసటిరోజు ఉదయం జయరాం రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు
హత్య జరుగడానికి ముందు జయరాం చివరి కాల్ కూడా శిఖా చౌదరికే వెళ్లింది. శిఖా చౌదరి కాల్ డేటా ఆధారంగా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆ రోజు క్రికెటర్ వెళ్లిన తర్వాతే జయరాంను శిఖా చౌదరి ఎందుకు ఇంటికి పిలిపించింది అని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.