»   » వైరల్ : హైపర్ ఆది లవ్ ప్రపోజ్ చేసిన ఆ భామ ఎవరు..సోషల్ మీడియాలో ఒకటే రచ్చ!

వైరల్ : హైపర్ ఆది లవ్ ప్రపోజ్ చేసిన ఆ భామ ఎవరు..సోషల్ మీడియాలో ఒకటే రచ్చ!

Subscribe to Filmibeat Telugu
హైపర్ ఆది లవ్ ప్రపోజ్: ఒకటే రచ్చ! వైరల్

హైపర్ ఆది..గత కొంత కాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. జబర్దస్త్ షోలో కామెడీ పంచులతో విపరీతమైన పాపులారిటీని ఈ యువ నటుడు సంపాదించాడు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కమెడియన్ గా కూడా ఎదుగుతున్నాడు. ఇటీవల విడువులైన తొలిప్రేమ చిత్రంలో హైపర్ ఆది కమెడియన్ గా నటించి మెప్పించాడు. హైపర్ ఆది వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యువతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేస్తున్న ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసాడు. స్ప్రెడ్ లవ్ అంటూ క్యాప్షన్ కూడా తగిలించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది లవ్ ప్రపోజ్ చేసిన ఆ యువతి ఎవరంటూ తెగ చర్చ జరుగుతోంది.

జబర్దస్త్ తో గుర్తింపు

జబర్దస్త్ తో గుర్తింపు

జబర్దస్త్ లో సాధారణ నటుడిగా మొదలైన ఆది ప్రస్తుతం క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయాడు. జబర్దస్త్ లో ఆది పేల్చే కామెడీ పంచ్ లు అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

దర్శకుల దృష్టిలో

దర్శకుల దృష్టిలో

హైపర్ ఆది కామెడీ టైమింగ్ అదుర్స్ అనిపించే విధంగా ఉండడంతో టాలీవుడ్ దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

తొలిప్రేమ చిత్రంలో ఛాన్స్

తొలిప్రేమ చిత్రంలో ఛాన్స్

వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రంతో కమెడియన్ గా ఆది అవకాశాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు ఆది చక్కగా నటించి నవ్వించాడు. ఆది నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 వైరల్ గా మారిన ఆది లవ్ ప్రపోజల్

వైరల్ గా మారిన ఆది లవ్ ప్రపోజల్

హైపర్ ఆది సోషల్ మీడియాలో యువతికి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటో వైరల్ గా మారింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఆది ఈ ఫోటో షేర్ చేసాడు.

ఆ యువతి ఎవరు

ఆ యువతి ఎవరు

ఆది షేర్ చేసిన ఫొటోలోని యువత ఎవరు అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆమె నిజంగానే ఆది గర్ల్ ఫ్రెండా అనే చర్చ జరుగుతోంది. కాగా దీనిపై ఆరా తీయగా విదేళ్లలో ఓ యువతితో ఇచ్చిన ఫోటో పోజు మాత్రమే అని తేలింది.

English summary
Hyper Aadhi love proposaol pic goes viral. Interesting discussion on it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu