అందుకే ‘అదిరింది’కి వెళ్లలేదు.. ఐదువారాల హడావిడి అంటూ హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్

జబర్దస్త్, అదిరింది షో మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన జబర్దస్త్ షోకు పోటిగా అదిరింది అనే కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతగా ఉన్న నాగబాబు అక్కడి నుంచి బయటకు రావడం, ఆ షోపైనా, నిర్వాహకులపైనా కామెంట్స్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. అదిరింది షో, నాగబాబు వెళ్లడం వంటి వాటిపై తాజాగా హైపర్ ఆది స్పందించాడు.

ఐదువారాల హడావిడి..

ఐదువారాల హడావిడి..

హైపర్ ఆదిని దాటాలంటే కొన్ని లెక్కలుంటాయని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు దాదాపు 130 స్కిట్స్ చేసి ఉంటాను.. అందులో పది, ఇరవై, ముప్పై మిలియన్ల స్కిట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, హయ్యస్ట్ రికార్డ్ 58మిలియన్స్ వ్యూస్ సాధించిన స్కిట్ ఒకటి ఉందని, ఇవన్నీ దాటాలని తెలిపాడు. ఏదో ఐదువారాల హడావిడి కాదు.. ఐదేళ్ల నుంచి ఎలా చేస్తున్నామని చూడాలని అదిరింది స్కిట్స్‌పై పంచ్ వేశాడు.

మా అందరికీ ఇష్టమైన వ్యక్తి..

మా అందరికీ ఇష్టమైన వ్యక్తి..

అన్ని షోలు బాగా నడవాలి, పోటీ అనేది ఉండాలని హైపర్ ఆది అన్నాడు. అక్కడ ఉన్నవారు కూడా మా వాళ్లే.. నాగబాబు అంటే మా అందరికీ ఇష్టమే ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకంటాడని తెలిపాడు. అక్కడికి వెళ్లినా మాకు మెసెజ్‌లు పెడుతుంటాడని పేర్కొన్నాడు.

అందుకు వెళ్లలేదు..

అందుకు వెళ్లలేదు..

నాగబాబుతో కలిసి అదిరింది షోకు వెళ్లాల్సిందే కానీ, అక్కడున్న కొందరి వ్యక్తుల అసలు స్వరూపాలు తెలిసి వెళ్లలేదని అన్నాడు. ఆ విషయం నాగబాబు గారికి కూడా తెలుసునని చెప్పుకొచ్చాడు. అందుకే తాను అదిరిందిలోకి వెళ్లలేదని పేర్కొన్నాడు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
ఎప్పటికీ ఆ బంధం..

ఎప్పటికీ ఆ బంధం..

నాగబాబుతో తనది ఐదేళ్ల బంధమని కేవలం షోతోనే కాకుండా జనసేన కార్యకలాపాల్లో కూడా నిత్యం పాల్గొన్నానని తెలిపాడు. నరసాపురం నియోజకవర్గంలో ఆయన వెంటే ఉన్నానని, మళ్లీ ఆయన నిలబడితే వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఆ బంధం ఎప్పటికీ అలానే ఉంటుందని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X