ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు ఎమోషనల్ అయ్యాను: హైపర్ ఆది

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు హైపర్ ఆది. తన పంచ్ లతో బుల్లితెర త్రివిక్రమ్ గా యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది ఎలాంటి స్కిట్ చేసిన మినిమమ్ ఫన్ ఉంటుందని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా ఆది తన కామెడీతో మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది తన లైఫ్ ప్లాన్స్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడాడు.

స్క్రిప్ట్ వర్క్ లోనే బిజీ..

స్క్రిప్ట్ వర్క్ లోనే బిజీ..

లాక్ డౌన్ కి ముందు రోజే నేను నా సొంత ఊరు ఒంగోలుకు బయలుదేరాను. ఇంట్లోనే ఉంటూ నెక్స్ట్ జబర్దస్త్ షోకి సంబంధించిన స్కిట్స్ తో బిజీగా కాలాన్ని గడిపేస్తున్నాను. అలాగే నా భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ప్లానింగ్ సెట్ చేసుకుంటున్నాను. కేవలం కామెడీ స్కిట్స్ అనే కాకుండా సినిమాలకు సంబంధించిన సీన్స్ కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను..

 సినిమా డైరెక్షన్..

సినిమా డైరెక్షన్..

సినిమాకు డైరెక్షన్ ఉంటుందో లేదో తెలియదు గాని కామెడీ స్కిట్స్ అనే కాకుండా నేను సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్స్ రాస్తున్నాను. ఒక ఫుల్ సినిమా కథను రాయగలను అనే నమ్మకం నాకు ఉంది. త్వరలోనే కొన్ని ఐడియాలతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాను. అలాగే జబర్దస్త్ షోను ఇప్పట్లో వదిలే ప్రసక్తే లేదు. నాకు లైఫ్ ఇచ్చిన షో నుంచి బయటకు రాలేను.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
ఆ రోజు పవన్ కళ్యాణ్..

ఆ రోజు పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలుసు. అయితే గత ఎలక్షన్స్ సమయంలో ఒకసారి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. నేను జనసేన పార్టీ కోసం పని చేస్తున్నాను అని ఆయనే నన్ను గుర్తించి ఇలానే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు ఇష్టమైన నటుడు, వ్యక్తి.. ఆ విధంగా చెప్పడం నన్ను ఎంతో ఆనందాన్ని కలిగించింది.

మెగాస్టార్ కూడా..

మెగాస్టార్ కూడా..

మెగాస్టార్ కూడా ఒకసారి నన్ను చాలా మెచ్చుకున్నారు. నా జీవితంలో అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అన్నపూర్ణ స్టూడియోలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం చిరంజీవి గారు వచ్చినప్పుడు నేను ఆయన కారు దగ్గర నిలబడి ఒక అభిమానిగా ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఆయన వచ్చి నీ ఎపిసోడ్స్ అన్ని నేను చూస్తాను. నీ వర్క్ నాకు చాలా నచ్చుతుందని అన్నారు. అలా అనగానే నాకు చాలా ఆనందం వేసిందని హైపర్ ఆది వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X