త్రివిక్రమ్ నుంచి పిలుపు రాలేదు, ఆయనకు ఎవరూ అవసరం లేదు: హైపర్ ఆది
తెలుగు టీవీ రంగంలో సూపర్ పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'.. ఈషో పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే కమెడియన్ హైపర్ ఆది. అతడు జబర్దస్త్‌లోకి ఎంటరైన తర్వాత మిగతా టీమ్స్ వెనకపడిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు సినిమా రంగంలో పంచులు వేయడంలో త్రివిక్రమ్ కింగ్ అయితే... తెలుగు టీవీ రంగంలో హైపర్ ఆది పంచుల కింగ్ అనే స్థాయిలో పాపులారిటీ వచ్చేసింది. తనను త్రివిక్రమ్‌తో పోల్చడంపై హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఆయనతో పోల్చడానికి కారణం అదే...
మనం రాసుకునే మాటలు కాస్త కొత్తగా, ఫీల్ చాలా మందికి నచ్చుతుంది. అలా మాటలు రాయడం ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయనతో నన్ను పోలుస్తున్నారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ నుంచి పిలుపు రాలేదు
త్రివిక్రమ్ గారు నన్ను పిలిపించారు అనే వార్తల్లో నిజం లేదు. కానీ సర్‌ను ‘అ..ఆ' సినిమా సమయంలో కలిశాను. తర్వాత పర్సనల్‌గా ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది. నన్ను రైటర్‌గా పని చేయాలని ఆయన ఎప్పుడూ అడగలేదు. ఆయన ఒక్కరే రాసుకుంటారు.. ఆయనకు ఎవ్వరూ అవసరం లేదని... ఆది తెలిపారు.

సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే నేను అనుకోకుండా ఇలా...
ఈ ఫీల్డులోకి రావాలనే ఇంట్రస్టుతో అయితే రాలేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా... స్నేహితులతో కలిసి అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ స్పూప్ చేశాం. ఆ వీడియోకు అదిరే అభి చూసి చాలా బావుంది బ్రదర్ అని కామెంట్ పెట్టారు. వీలైతే మీట్ అవుదామన్నారు. అలా తొలిసారి జబర్దస్త్ సెట్‌లోకి వెళ్లాను.

అలా టీమ్ లీడర్ స్థాయి వరకు
మేము బీటెక్ చేసే సమయంలో జబర్దస్త్ బాగా ఎంజాయ్ చేసేవారం. అలాంటిది వారి నుంచి ఫోన్ రావడంతో వెళ్లి కలిశాం. అప్పటి వరకు మనం ఫేస్‌బుక్‌లో ఫోటో పెడితే 2 లైకులు వచ్చేవి. జబర్దస్త్ వారితో దిగిన ఫోటోలు పెడితే 200 లైక్స్ వచ్చాయి. వారితో కలిసి టీవీలో కనిపిస్తే ఇంకెన్ని లైక్స్ వస్తాయో అని అటు వైపుగా ట్రై చేశాను. మొదట టీమ్‌లో రైటర్‌గా అడుగు పెట్టి తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ టీమ్ లీడర్ స్థాయి వరకు వచ్చినట్లు హైపర్ ఆది తెలిపారు.


Click it and Unblock the Notifications











