క్యారవాన్‌లో సుధీర్ చేసే పనులివే.. నిజాలు బయట పెట్టిన హైపర్ ఆది
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ కలిస్తే పంచ్‌ల వర్షం కురవాల్సిందే. చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. అలా వారిద్దరి మధ్యలోకి ప్రదీప్ వస్తే మరో రేంజ్ ఉంటుంది. ఈ త్రయం ఢీ షోలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు స్కిట్స్, ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది. ఈ ముగ్గురితో పాటు రష్మీ, వర్షిణి, జడ్జ్‌లు ఇలా అందరితో ఫన్ క్రియేట్ చేయిస్తున్నారు.
Recommended Video

మారిన షో..
ఒకప్పుడు ఢీ షో అంటే అదిరిపోయే డ్యాన్సుల, కళ్లు చెదిరిపోయే పర్ఫామెన్స్‌లుండేవి. అందులోంచి బాబా మాస్టర్, శేఖర్ మాస్టర్ వంటి ఎందరో గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్స్ వచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న షోలో డ్యాన్సులతో పాటు నవ్వుల సందడి ఎక్కువయ్యాయి.

మధ్యలో స్కిట్స్..
ప్రస్తుతం దాదాపు అందరూ ఢీ షోను మధ్యలో వచ్చే స్కిట్స్, ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే వీక్షిస్తున్నారు. సుడిగాలి సుధీర్-రష్మీ కెమిస్ట్రీ, హైపర్ ఆది-వర్షిణిల జోడి, ప్రదీప్ కౌంటర్స్, శేఖర్ మాస్టర్ పంచ్‌లు, పూర్ణ, ప్రియమణి గ్లామర్ ఇలా అన్నీ హైలెట్ అవుతున్నాయి.

కెమిస్ట్రీతోనే హైలెట్.
ఢీ షోలో సుడిగాలి సుధీర్-రష్మీ, హైపర్ ఆది-వర్షిణిల కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కౌట్ అయింది. రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, స్కిట్లతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య హైపర్ ఆది-వర్షిణిల జోడికి విపరీతమైన పాపులారిటీ దక్కింది.

క్యారవాన్‌లా నటించిన ఆది..
తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో క్యారవ్యాన్‌గా ఆది నటించాడు. ఇక అందులో సుధీర్ చేసే పనుల గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఏంటి ఈడొచ్చాడు.. ఎవరైనా వచ్చాకే వీడు రావాలి కదా.. ఏంటి ఈ రోజు ఒక్కడే వస్తున్నాడు. ఎవరో ఒకరు రావాలి కదా.. హా హా వస్తున్నారు.. వచ్చారు చెయ్ రా ఏదోకటి చేయాలి కదా.. ఏంటి ఇంకొకరు వస్తున్నారు.. వీళ్లు వెళ్లాక కదా.. అంటూ సుధీర్ పరువుదీశాడు హైపర్ ఆది.


Click it and Unblock the Notifications











