తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందే! వర్షిణితో రెచ్చిపోతున్న కమెడియన్.. హైపర్ ఆది క్లారిటీ

జబర్దస్త్ తెరపై వచ్చే కామెడియన్లలో హైపర్ ఆది స్టయిలే వేరు. మనోడు రంగంలోకి దిగాడంటే చాలు యాంకర్ మొదలుకొని జడ్జ్‌ల వరకూ అందరిపై పంచులమీద పంచులు విసురుతుంటాడు. హైపర్ ఆది దెబ్బకు పంచులు పడ్డా కూడా తప్పని పరిస్థితి ఆ యాంకర్, జడ్జ్‌లది. అలాంటి హైపర్ ఆది.. కాస్త ట్రాక్ చేంజ్ చేసి ఈ మధ్యకాలంలో బుల్లితెరపై రొమాంటిక్ కిక్ ఇస్తున్నాడు. దీంతో ఈయనపై పలు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు హైపర్. వివరాల్లోకి పోతే..

 జబర్దస్త్ కమెడియన్ రొమాంటిక్‌సెన్స్

జబర్దస్త్ కమెడియన్ రొమాంటిక్‌సెన్స్

హైపర్ ఆదిలో కేవలం పంచులు వేయడం మాత్రమే కాదండోయ్! మరో లక్షణం ఉంది. అదే రొమాంటిక్ డోస్.. బుల్లితెరపై ఆయన ఇచ్చే రొమాంటిక్ కిక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అనసూయ- హైపర్ ఆది జోడీకి, వాళ్ళ మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలకు భలే డిమాండ్ ఉంటుంది.

యాంకర్ వర్షిణితో రెచ్చిపోతున్న హైపర్ ఆది

యాంకర్ వర్షిణితో రెచ్చిపోతున్న హైపర్ ఆది

ఈ బాటలోనే ఇప్పుడు మరో యంగ్ యాంకర్ వర్షిణితో కూడా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారిన ఆయన యాంకర్ వర్షిణితో వేస్తున్న రొమాంటిక్ డ్యూయెట్స్ అబ్బో! అనిపిస్తున్నాయి. ఢీ ఛాంపియన్స్‌లో ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా పండుతోంది.

 ఓ వైపు రొమాంటిక్ డ్యూయెట్స్.. మరోవైపు అలా!

ఓ వైపు రొమాంటిక్ డ్యూయెట్స్.. మరోవైపు అలా!

ఓ వైపు రొమాంటిక్ డ్యూయెట్స్ చేస్తూనే.. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ బుల్లితెర వినోదం పంచుతున్నాడు హైపర్ ఆది. ఢీ ఛాంపియన్స్‌లో సుధీర్, రష్మి జోడీని మరిపించే విధంగా ఈ ఇద్దరూ మాయ చేస్తున్నారు. దీంతో ఆ కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన కొందరు ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు పుట్టించారు.

హైపర్ ఆది- వర్షిణి.. మొత్తానికి ఏదో నడుస్తోంది

హైపర్ ఆది- వర్షిణి.. మొత్తానికి ఏదో నడుస్తోంది

గత కొద్ది రోజులుగా హైపర్ ఆది- వర్షిణి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి. దీనికి కూడా పరోక్షంగా హైపర్ ఆదినే కారణమయ్యాడు. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకోవడంతో రూమర్స్ మరింత గుప్పుమన్నాయి.

 తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందేగా!

తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందేగా!

దీంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై స్పందించిన హైపర్ ఆది.. ఇదంతా తాము ఢీ ఛాంపియన్స్ కోసమే చేస్తున్నామని అన్నాడు. అవతలి వైపు సుధీర్, రష్మి లాంటి జోడీ ఉన్నారు కాబట్టి వాళ్లను తట్టుకోవాలంటే ఆ మాత్రం రొమాన్స్ చేయాల్సిందేగా అని చెప్పాడు. కాకపోతే ''అంతా తూచ్.. మేం చేసేది రేటింగ్స్ కోసం మాత్రమే'' అనేశాడు ఈ జబర్దస్త్ కమెడియన్.

Recommended Video

Nani Vs Vijay Devarakonda Fans | V Teaser | World Famous Lover
దొరికితే రెడీ.. వేదిలేదే లేదు

దొరికితే రెడీ.. వేదిలేదే లేదు

ఇదిలా ఉంటే త్వరలోనే తాను కూడా సుధీర్ లాగే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఇటీవలే ప్రకటించాడు హైపర్ ఆది. తనకు పాటలు, ఫైట్లు అంతగా సెట్ కావని, ప్రస్తుతానికి పాటలు, డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నానని తెలిపాడు. మంచి కథ దొరికితే రెడీ అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X