Just In
- 44 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైపర్ ఆదికి చుక్కలు చూపించిన అనసూయ.. దెబ్బకు దడుసుకున్నాడు!!
పండుగ ఏదైనా ఈవెంట్ ఏదైనా సరే అందులో హైపర్ ఆది సందడి ఉండాల్సిందే. ఆది లేకుండా దాదాపుగా ఈవెంట్లు జరగవు. మామూలుగా అయితే ఆది, సుధీర్‌లు ఇద్దరూ కలిసి ఈవెంట్‌ను ఈజీగా లాగించేస్తారు. కానీ ఈ సారి సంక్రాంతి ఈవెంట్‌లో మాత్రం ఆది సింగిల్ హ్యాండ్‌గా దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు వైరల్అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం పీక్స్‌లో ఉంది.

అత్తో అత్తమ్మ కూతురో..
ప్రతీ ఈవెంట్‌లో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా ఈ సారి మాత్రం మూడు జంటలతో అత్తో అత్తమ్మ కూతురో అంటూ రాబోతోన్నారు. ఇందులో రోజా మెయిన్ లీడ్‌గా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండబోతోంది. ఇక వెరైటీగా రష్మీ చేత యాంకరింగ్ చేయిస్తున్నారు.

మూడు జంటలతో రచ్చ..
హైపర్ ఆది అనసూయ, రోహిణి రాం ప్రసాద్, వర్ష ఇమాన్యుయేల్‌లు జంటలుగా నటిస్తున్నారు. ఈ మూడు జంటలు రోజాకు కూతుళ్లు అల్లుళ్లు. ఇలా ఒక కాన్సెప్ట్‌తో ఎంటర్టైన్ చేయడం ఎప్పటి నుంచో వస్తోన్న కథే. కానీ ఇక్కడ ఈ మూడు జంటలు మాత్రం రచ్చ రచ్చ చేయడమే కొత్త.

అల్లుకుపోయిన ఆది..
దొరికిందే చాన్స్ అని ఆది అనసూయకు అల్లుకుపోయినట్టు కనిపిస్తోంది. మొదటగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఏకంగా మన బేబీ గురించి అత్తమ్మ అడుగుతోందంటూ కొంటె కామెంట్ చేశాడు ఆది. అలా అనసూయ ఆది రొమాన్స్ బాగానే వర్కవుట్ అయింది.

తాజాగా ఇలా..
అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం ఈ మూడు జంటలకు ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు పెట్టారు. ఇందులో వర్ష ఇమాన్యుయేల్, ఆది అనసూయ, రోహిణి రాం ప్రసాద్‌ల జంటలు మూడు ట్రాక్టర్‌లపైకి ఎక్కారు. ప్రదీప్ కూడా వారితో పాటు పోటీల్లో పాల్గొన్నాడు.

దెబ్బకు దడుసుకున్న ఆది..
అనసూయకు ట్రాక్టర్ డ్రైవింగ్ రాదు.. కనీసం యాక్సలేటర్, బ్రేక్ ఎక్కడుందో కూడా తెలియడం లేదు.. ఏదోలా మెల్లిగా స్టార్డ్ చేసింది.. అలా జెర్క్‌లు ఇస్తుండటంతో అది వణికి పోయాడు. నీకు కూడా డ్రైవింగ్ రాదా? అంటూ భయపడ్డాడు. కాపాడండిరో అంటూ ఆది కేకలు వేసేశాడు. మొత్తానికి అనసూయ చేసిన పనికి ఆదికి చుక్కలు కనిపించినట్టున్నాయి.