For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది: కాళ్లు పట్టుకుని.. బ్యాడ్ చేయడానికే అంటూ!

  |

  ఈ దశాబ్ద కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సుడిగాలి సుధీర్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అనతి కాలంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఇటీవలే స్టార్ మాలోకి వెళ్లిన సుధీర్.. ఇప్పుడు ఒక ఈవెంట్ కోసం ఈటీవీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై హైపర్ ఆది దారుణమైన పంచులు వేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  జబర్ధస్త్‌తో సుడిగాలి సుధీర్‌కు లైఫ్

  జబర్ధస్త్‌తో సుడిగాలి సుధీర్‌కు లైఫ్

  మ్యాజిక్‌లు చేసుకుంటూ పలు షోలు చేస్తోన్న సమయంలో సుధీర్ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో ద్వారా అతడికి కొత్త లైఫ్ లభించింది.

  యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!

  వరుస మూవీలతో.. హీరోగా సందడి

  వరుస మూవీలతో.. హీరోగా సందడి

  సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. ఇప్పుడు సుధీర్ 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి సినిమాల్లో హీరోగా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

  ఆ ఛానెల్‌ వదిలిన టీవీ సెన్సేషన్

  ఆ ఛానెల్‌ వదిలిన టీవీ సెన్సేషన్

  జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సుడిగాలి సుధీర్ ఈటీవీలోనే పలు కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే, ఇటీవలే లైఫ్ ఇచ్చిన షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజలు పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీకి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

  ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

  అందులోకి ఎంట్రీ... షో, ఈవెంట్లు

  అందులోకి ఎంట్రీ... షో, ఈవెంట్లు


  ఈటీవీ నుంచి తప్పుకున్న సుడిగాలి సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టాడు. అందులో ప్రసారం అవుతోన్న 'సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేస్తున్నాడు. అలాగే ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా చేస్తోంది. దీనితో పాటు పలు ఈవెంట్లు కూడా చేస్తున్నాడు. అలా అక్కడ కూడా తన సత్తాను చూపిస్తూ రెచ్చిపోతోన్నాడు.

  ఈటీవీలోకి రీఎంట్రీ.. సుధీర్ హైప్

  ఈటీవీలోకి రీఎంట్రీ.. సుధీర్ హైప్

  ప్రముఖ ఛానెల్ ఈటీవీ 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 28న అందులో పని చేసిన చేస్తున్న ఆర్టిస్టులతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి 'భలే మంచి రోజు' అనే పేరు పెట్టారు. ఇక, ఈ ఈవెంట్ కోసం సుడిగాలి సుధీర్ ఈటీవీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అతడికి ఇందులో బాగా హైప్ ఇచ్చినట్లుగా చూపించారు.

  అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

  సుధీర్‌పై హైపర్ ఆది పంచులు

  'భలే మంచి రోజు' ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌పై హైపర్ ఆది పంచుల వర్షం కురిపించాడు. ముందుగా అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడు కొందరు కమెడియన్లు రచ్చ చేస్తుంటారు. అప్పుడు ఆది 'ఒకసారి మారితే అంతా మారతారు' అని పంచ్ వేశాడు. తర్వాత ప్రదీప్.. ఈయన మిమ్మల్ని ఒకచోట ఉంచుతాడు అని సుధీర్‌ను చూపించగా.. 'ముందు ఆయన్ని ఒక చోట ఉండమను' అని మరో సెటైర్ వేశాడు.

  కాళ్లు పట్టుకోవడంతో ఆరోపణలు

  కాళ్లు పట్టుకోవడంతో ఆరోపణలు


  'భలే మంచి రోజు' ఈవెంట్‌లో భాగంగా సుధీర్ ఒక స్కిట్ చేశాడు. అందులో ఒకమ్మాయి ఆదితో అన్నయ్య ఈయన్ని నేను ప్రేమించాను అంటుంది. అప్పుడు సుధీర్ 'అప్పుడులా కాదండి. నేను మారిపోయాను' అన్నాడు. దీనికి ఆది 'పక్క చానెల్‌కా' అని పంచ్ వేశాడు. ఇక, చివర్లో ఆది కాళ్లను సుధీర్ పట్టుకోగా 'కావాలని కిందకు వచ్చేస్తాడు. మనల్ని బ్యాడ్ చేయడానికి' అని ఆది సరదాగా ఆరోపణలు చేశాడు.

  English summary
  Jabardasth Talented Comedian Sudigali Sudheer Participated in Bhale Manchi Roju Event. Another Comedian Hyper Aadi Allegations on Him in This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X