ఆదికేశవరెడ్డిలా వస్తే.. అర్జున్‌రెడ్డిలా.. అనసూయ ఉండగానే... హైపర్ ఆది బట్టలు విడిపించిన యాంకర్
బుల్లితెరపైన హైపర్ ఆది కామెడీకి ఓ బ్రాండ్ వ్యాల్యూ ఉందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయన ఏ షోలో ఉంటే అక్కడ వినోదం పండాల్సిందే. జబర్దస్త్, ఢీ లాంటి షోలో తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తున్నారు. త్వరలో యాంకర్, హోస్ట్, డైరెక్టర్ ఓంకార్ ప్రారంభించే సిక్త్ సెన్స్ షోలో ఆది రచ్చ చేశారు. ఓ కారణంగా బట్టలు విడిపించి హంగామా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

డాన్సీ ప్లస్ షో ముగియగానే...
కొద్ది రోజుల క్రితమే డాన్సీ ప్లస్ షోతో ఓంకార్ హంగామా సృష్టించారు. డ్యాన్సీ ప్లస్ ఫైనల్స్ ఇటీవలే ముగిసాయి. అలా డ్యాన్సీ ప్లస్ సీజన్ ముగిసిందో లేదో.. వెంటనే సిక్త్‌సెన్స్ సీజన్ 4కు తెర లేపారు. వరుసగా షోలు చేస్తూ ఓంకార్ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తరకం ఫార్మాట్‌తో ముందుకొస్తున్నారు.

సిక్త్‌సెన్స్ షోకు మంచి పాపులారిటీ
బుల్లితెరపైన యాంకర్ ఓంకార్ నిర్వహించే సిక్త్‌సెన్స్ షోకు మంచి పాపులారిటి ఉంది. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. నాలుగో సీజన్‌కు సంబంధించిన తొలి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అనసూయ, హైపర్ ఆది రచ్చ చేశారు.

అర్ధనగ్నంగా మారిన ఆది
అనసూయ, ఆది జంటగా సాగిన గేమ్ షో సరదాగా సాగినట్టు కనిపించింది. అనసూయకు ఏదో సూచనలు ఇస్తూ.. సెకండ్ నంబర్‌కు వెళ్లిపో.. నేను ఇక్కడే బట్టలు విప్పేస్తాను.. ఉతికి ఇచ్చిపో అంటూ కనిపించారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ.. ఆది చొక్కా విప్పి అర్ధనగ్నంగా మార్చేశారు.

అర్జున్ రెడ్డిని చేశారంటూ...
అనంతరం షర్ట్ లేకుండా సోఫాలో కూర్చొన్న ఆది మాట్లాడుతూ... ఆదికేశవరెడ్డిలా వచ్చాను.. అర్జున్ రెడ్డిని చేశారు అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా 10 లక్షల రూపాయల కోసం ఏదో గేమ్ నడుస్తుండగా.. దానిని లోపల పెట్టేయమని అంటూ కనిపించాడు. పొరపాటున 10 లక్షలు మిస్ అవుతున్నారేమో అంటూ ఓంకార్ కామెంట్ చేస్తే.. కావాలంటే నీకే లక్ష రూపాయలు ఇస్తాను.. ఇలా కూడా బతకనివ్వరా అంటూ ఆది అన్నాడు.
జూన్ 12వ తేదీన ప్రారంభం
హైపర్ ఆది, అనసూయ ఇతర సభ్యులు పాల్గొన్న సిక్త్‌సెన్స్ సీజన్ 4 జూన్ 12వ తేదీన ప్రారంభం కానున్నది. ఎంతో ఉత్కంఠగా సాగే ఈ షో ముంద వచ్చిన సీజన్ల మాదిరిగానే సీజన్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











