హైపర్ ఆది, అనసూయ భార్యభర్తలుగా.. మరోవైపు రష్మీ, సుధీర్ సరసాలు.. రచ్చ రచ్చ చేశారుగా!

తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ షో దూసుకుపోతోంది. ఈ కామెడీ షోకు అదిరిపోయే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జబర్డస్త్ షో వలన హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శీను లాంటి కమెడియన్లు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో ఎలాంటి పాపులారిటీని తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గురువారం రోజు వాలంటైన్స్ డే సందర్భంగా జబర్దస్త్ ని స్పెషల్ గా ప్లాన్ చేశారు. గురువారం జరగబోయే ఎపిసోడ్ లో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలయింది.

హైపర్ ఆది భార్యగా అనసూయ

హైపర్ ఆది భార్యగా అనసూయ

వాలంటైన్స్ డే స్పెషల్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది, అనసూయ భార్య భర్తలుగా స్కిట్ లో నటిస్తున్నారు. అనసూయని ఉద్దేశిస్తూ ఆది తనదైన శైలిలో సెటైర్లు పేల్చుతున్నారు. ఏమే అనసూయ అని అది పిలవగానే కోపంగా చూస్తుంది. దీనితో ఆది అనసూయ గారు అని పిస్తాడు. ఇక్కడ మొగుడు పెళ్ళాల రిలేషన్ ఎక్కడ ఉంది.. అదే టీం లీడర్.. యాంకర్ రిలేషన్ అని ఆది అంటాడు. అనసూయ తన పక్కకు వచ్చి నిలబడగానే.. పదంతస్తుల మీద పక్కన పదో తరగతి పిల్లాడిలా ఉన్నానని ఆది వేసే జోకులు బాగా నవ్వించే విధంగా ఉన్నాయి.

రొమాంటిక్ యాంగిల్

రొమాంటిక్ యాంగిల్

అనసూయ ఆది భుజంపై చేయి వేసి రొమాంటిక్ గా పిలుస్తుంది. జల్లి కట్టు ఆటలో పెద్ద పెద్ద వాటినే లొంగదీసుకుంటాం.. కానీ తాళికట్టు ఆటలో ఇలా చిన్నవాటికి కూడా లొంగిపోతాం అని ఆది అంటాడు. ఈ లోపు ఆది తోడల్లుడిగా సుధీర్ ఎంట్రీ ఇస్తాడు. సుధీర్, రష్మీ కూడా భార్య భర్తలుగా ఈ స్కిట్ లో పాల్గొంటున్నారు. రష్మీ, సుధీర్ రొమాంటిక్ గా మెలికలు తిరుగుతుంటారు. అరె ఏంట్రా కుబుసం విడిచిన తాచుపాములా తెగ మెలికలు తిరుగుతున్నావు అని ఆది వేసే సెటైర్ అద్భుతంగా పేలింది.

 సౌత్ కొరియా, నార్త్ కొరియా

సౌత్ కొరియా, నార్త్ కొరియా


ఎప్పుడూ నార్త్ కొరియా, సౌత్ కొరియా లాగా ఉండే అనసూయ, జనాలు చూస్తుంటే మాత్రం అక్కా చెల్లెళ్ళ తరహాలో జీవిస్తారని అది వారిద్దరిపై కూడా తన కామెడీ పంచ్ పేల్చాడు. అదే సమయంలో అనసూయ, రష్మీ, రోజా మేకప్ పై కూడా అది కామెడీ పంచులు పేలుతాయి. అంతలో అనసూయ, రష్మీ తల్లి క్యారెక్టర్ లో చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు.

అదిరిపోయేలా

అదిరిపోయేలా

ఈ ప్రోమో చూస్తుంటే వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ని జబర్దస్త్ టీం అదిరిపోయేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రోమో మొత్తం ఫన్నీగా సాగుతోంది. ఇక ఎపిసోడ్ లో ఆది, అనసూయ.. రష్మీ, సుధీర్ కలసి చేసిన రచ్చని ఆస్వాదించాల్సిందే. మిగిలిన టీం సభ్యులు కూడా మంచి స్కిట్ లని సిద్ధం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X