పూర్ణ లేకపోతేనే షో బాగుంటుంది?.. దారుణంగా ఆటో రాం ప్రసాద్, హైపర్ ఆది కామెంట్స్
బుల్లితెరపై పూర్ణ చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. అవును వంటి సినిమాతో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది నటి పూర్ణ. పూర్ణ సినీ కెరీర్ అంత సవ్యంగా ఏమీ సాగలేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా కూడా అవును సినిమాతోనే గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ద్వారా మరీ ఎక్కువ ఆఫర్లు కూడా రాలేదు. దీంతో కొన్ని రోజులు పూర్ణ తెరకు దూరమైంది. ఆ తరువాత తిరిగి బుల్లితెరపైకి వచ్చింది. బుల్లితెరపై కొత్త పూర్ణను అందరూ చూశారు. మళ్లీ ఆమెకు ఇమేజ్ ఏర్పడింది. తద్వారా వెండితెరపైనా ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పూర్ణపై జబర్దస్త్ కమెడియన్లు చేసిన కామెంట్స్ ఏమిటంటే..

ఇంట్లో అయిష్టంగానే..
పూర్ణది ముస్లిం ఫ్యామిలీ. షమ్మా ఖాసిమ్ అనేది ఆమె ఒరిజినల్ నేమ్. కానీ స్క్రీన్ కోసం పూర్ణ అనే పేరును పెట్టుకుంది. ఇక పూర్ణగానే ఆమె ఫేమస్ అయింది. అయితే తన ఇంట్లో అన్నకి తాను ఇలా నటించడం, సినిమాల్లో పాత్రలు వేయడం, గ్లామర్ పాత్రలు పోషించడం, బొట్టు పెట్టుకోవడం వంటివేమీ నచ్చవని చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ అంతా కూడా దుబాయ్‌లోనే ఉంటుందని తెలిసిందే.

బుల్లితెరపై..
పూర్ణకు అవును, అవును 2 చిత్రాలే అంతో ఇంతో గుర్తింపును తెచ్చాయి. ఆ తరువాత ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ చిత్రాలేవీ రాలేదు. అయితే కొన్ని రోజులకు సిల్వర్ స్క్రీన్‌కు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. పూర్ణ చాలా రోజులకు బుల్లితెరపైకి వచ్చింది. ఢీ షోలో పూర్ణ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పూర్ణ చేసే అతి ఎలా ఉంటుందో, దాని మీద ఎంతటి ట్రోలింగ్ జరిగిందో అందరూ చూశారు.

బుగ్గలు కొరుకుతూ..
ఢీ షోలో పూర్ణకు ఎవరి డ్యాన్స్ పర్ఫామెన్స్ అయినా విపరీతంగా నచ్చితే.. ప్రశంసలతో వదిలపెట్టదు. బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడం, ముద్దులు పెట్టడం చేస్తుండేది. ఆ మధ్య ఇలానే తరుచూ బుగ్గలు కొరుకుతుండటంతో నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అది అసలు ఢీ షోనా? లేకా ఇంకేదైనా షోనా? అంటూ నెటిజన్లు బండబూతులు తిట్టారు.

మల్లెమాలలో ఫిక్స్..
పూర్ణ ఢీ షో నుంచి పక్కకు వచ్చింది. కానీ మల్లెమాలను మాత్రం వదల్లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, పండుగ ఈవెంట్లు అంటూ తిరుగుతూ ఉండేది. ఇక ఇప్పుడు అసలే జడ్జీల కొరత ఎక్కువగా ఏర్పడింది. అందుకే పూర్ణను శ్రీదేవీ డ్రామా కంపెనీకి తీసుకొచ్చారు. రోజా స్థానంలో ఇంద్రజ వెళ్తే.. ఇంద్రజ స్థానంలోకి పూర్ణను తీసుకొన్నారు. ఓ రెండు మూడు ఎపిసోడ్‌లకు పూర్ణ బాగానే వచ్చింది. ఆ తరువాత గ్యాప్ ఇచ్చింది.

రీ ఎంట్రీ..
తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో పూర్ణ వచ్చింది. పూర్ణ వదిలిన గ్యాప్‌లో ప్రగతి, ఇంద్రజ వచ్చి చేశారు. అయితే ఇప్పుడు ఇలా మళ్లీ రావడంతో ఆది, రాం ప్రసాద్‌లు సెటైర్లు వేశారు. ఏంటి నాలుగు ఎపిసోడ్‌లకు గ్యాప్ ఇచ్చారు అని ఆది అంటే.. మీరు చూడలేదా? మీరు లేనప్పుడే షో బాగుంది.. ఆ గ్యాప్‌ను కంటిన్యూ చేస్తే బాగుండేది కదా? అంటూ ఆటో రాం ప్రసాద్ నోరు జారాడు. దీంతో పూర్ణ మోచేత్తో రాం ప్రసాద్ కడుపులో ఒక్కటిస్తుంది. మొత్తానికి పూర్ణ ఇప్పుడైనా కంటిన్యూ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











