మల్లెమాలపై ఆర్పీ సంచలనం.. అన్నీ అబద్దాలే అంటూ రంగంలోకి దిగిన హైపర్ ఆది, రామ్ ప్రసాద్
గత కొద్దిరోజులుగా జబర్దస్త్ గురించి మల్లెమాల సంస్థ గురించి అందులో కమెడియన్గా చేసి బయటకు వచ్చి వేరే చానల్స్ లో కొన్ని షోస్ చేస్తున్న కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి. జబర్దస్త్, మల్లెమాల సంస్థ వారు కేవలం వ్యాపారం చేస్తున్నారని అందులో చేసే వారికి ఎలాంటి ఆపద వచ్చినా నాగబాబు ముందుండి నడిపించేవారు కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి అసలు ఎలాంటి విషయాలలో ముందుకు వచ్చేవారు కాదని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ కూడా ఆర్పీ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇదంతా నిజం కాదని వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

అబద్ధాలు
జబర్దస్త్, మల్లెమాల సంస్థ మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు అన్ని నిజం కాదని హైపర్ ఆది జబర్దస్త్ రాంప్రసాద్ వెల్లడించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆర్పీ కూడా తమలాంటి వాడేనని అయితే ఎందుకిలా అబద్ధాలు చెబుతున్నాడో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండించడానికి వచ్చామని వెల్లడించారు.

మాట్లాడింది తప్పు
అసలు ఆర్పీ శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి అంటే ఎవరు ఒక టాప్ ప్రొడ్యూసర్ కొడుకు, ఒక సీఎం అల్లుడు అలాంటి వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని హైపర్ ఆది అన్నారు. ఆది మాట్లాడుతూ ఒక్కసారి ఆ మాట్లాడిన వీడియో ఆర్పీ అన్న చూసుకున్నా సరే నేను ఎక్కడి నుంచి వచ్చాను? నన్ను ఎవరు గేటు లోపలికి పంపించారు? నాకు ఎవరు అవకాశాలు ఇచ్చారు. అనే విషయాలు గుర్తుతెచ్చుకుంటే ఆయన మాట్లాడింది తప్పు అనే విషయం ఆయనకే అర్థమవుతుందని చెప్పుకొచ్చారు.

వ్యక్తి ఆధారంగా
అంతేకాక టీఆర్పీల గురించి మాట్లాడుతున్నారని టీఆర్పీలు అనేవి ఒక వ్యక్తి ఆధారంగా ఉండే అవకాశం ఏ లేదని డైరెక్టర్లు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి టీఆర్పీలు ఉంటాయి తప్ప అందులో పాల్గొనే వారంతా నిమిత్తమాత్రులు అని ఆది చెప్పుకొచ్చారు. ఫుడ్ బాగోలేదని ఆరోపణల మీద స్పందిస్తూ సాధారణంగా మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే 10 ఐటమ్స్ లో రెండు ఐటమ్స్ బాగోక పోవచ్చు అంతమాత్రాన అది చెత్త అనుకుంటే ఎలా అది కూడా మనకోసం మనం రూపొందించుకున్న వంటలే కదా అని నన్నారు.

సమయం చూసుకుని
ఇప్పుడు ఏదో వేరే ఛానల్ కు వెళ్లాం కదా అని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. రామ్ ప్రసాద్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మేము ఈ ఇంటర్వ్యూ చూసిన సమయంలో ఇక్కడికి వచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి అనిపించింది కానీ అప్పుడు ఇద్దరం షూటింగ్లో ఉన్నామని అందుకే సమయం చూసుకుని వచ్చామని చెప్పాడు. అలాగే గతంలో తన తల్లి చనిపోయినప్పుడు జబర్దస్త్ తనని ఆదుకుంది అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ వీడియో ప్లే చేశారు రామ్ ప్రసాద్.

గుండు కొట్టించుకుంటానని
ఇలాంటి వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో తమకు తెలియడం లేదని, తమతో కలిసి పనిచేసిన వ్యక్తి గుండు కొట్టించుకుంటాను అంటే మాకే అదోలా అనిపిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిజానికి ఆర్పీ జబర్దస్త్ నుంచి తర్వాత ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే వాళ్లు జబర్దస్త్ గొప్పదని గనుక చెప్పితే తాను గుండు కొట్టించుకుంటానని ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినా సరే తాను గుండు కొట్టించుకుంటానని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











