రష్మీ- సుధీర్‌లకు 40 లక్షలు.. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ షాకింగ్ రివీల్!

తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇప్పటికే ఈ షో నుంచి పలువురు కమెడియన్లు బయటకు రావడం, ఆ తరువాత ఈ షో మేకర్స్‌పై సంచలన వ్యాఖ్యలు కామన్ అయింది. అలాగే కమెడియన్ కిర్రాక్ ఆర్పీ కూడా జబర్దస్త్,మల్లెమాల సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్పీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా హైపర్ ఆది, రామ్ ప్రసాద్ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఆర్పీ వ్యాఖ్యలను ఖండించారు. అసలు విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.?

గత కొద్ది రోజులుగా జబర్దస్త్ నుంచి వరుసగా కమెడియన్లు బయటకు వెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నాగబాబు మొదలుకొని ఇటీవల సుడిగాలి సుధీర్ వరకు షోకు గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదే సమయంలో కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మల్లెమాల సంస్థ కేవలం వ్యాపార దృష్టితోనే పనిచేస్తుందని, షోలో పనిచేసే కమెడియన్లకు ఏదైనా సమస్య వచ్చినా పట్టించుకోరని ఆర్పీ ఆరోపించారు. దీంతో జబర్దస్త్ ప్రతిష్టకు దెబ్బ పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

Hyper Aadi and Ram Prasad Reveal Shocking Truths About Jabardasth Rashmi and Sudheer

ఇదిలా ఉంటే.. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..ఆర్పీ ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ అబద్ధాలేనని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి, ఆర్పీ మాట్లాడిన విధానం పూర్తిగా తప్పని హైపర్ ఆది తీవ్రంగా మండిపడ్డారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఒక ప్రముఖ నిర్మాత కుమారుడని, మాజీ ముఖ్యమంత్రి అల్లుడని, అలాంటి వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ఇంటర్వ్యూలో అసలు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు హైపర్ ఆది, రామ్ ప్రసాద్. జబర్దస్త్, మల్లెమాల సంస్థ కమెడియన్లకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుందని, ఫైనాన్షియల్ సమస్యల్లో ఉన్నవారికి లక్షల రూపాయల వరకు అడ్వాన్సులు ఇచ్చారని తెలిపారు.

"నాకు, సుధీర్‌కు, రష్మీకి, గెటప్ శీనుకు, రామ్ ప్రసాద్‌కు... ఇలాగే చాలామందికి అవసరమైన సమయంలో కొన్ని లక్షలు స్పాట్‌లో ఇచ్చారు. సుధీర్‌కు అయితే దాదాపు 40నుంచి 50 లక్షల రూపాయల వరకు సహాయం చేశారు'అని హైపర్ ఆది వెల్లడించాడు.అంతేకాదు, రష్మీ విషయంలోనూ మల్లెమాల సంస్థ పెద్ద సపోర్ట్ చేసిందని చెప్పారు. రష్మీకి లోన్ అవసరం వచ్చినప్పుడు, ఆమె మా తరఫునే పనిచేస్తోందని మల్లెమాల సంస్థ అశ్యూరెన్స్ ఇవ్వడం వల్లే బ్యాంకు నుంచి లోన్ సాంక్షన్ అయ్యిందని తెలిపారు. 'ఇలా ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడానికి ఎవరు ధైర్యం చేస్తారు?మల్లెమాల చేసింది'అంటూ హైపర్ ఆది స్పష్టం చేశాడు.

ఇక సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లడంపై వస్తున్న ఆరోపణలపై రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. సుధీర్‌ను ఎవరు గెంటివేయలేదని, అవమానపరిచి బయటకు పంపారన్నది పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. వాస్తవానికి సుధీర్ రెండు సంవత్సరాల ముందే జబర్దస్త్‌ను వదిలేయాల్సి ఉన్నప్పటికీ, స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని తమ కోసం అక్కడే కొనసాగాడని తెలిపారు. అదే సమయంలో సుధీర్‌కు సినిమాల్లో అవకాశాలు పెరగడం, ఫైనాన్షియల్ అవసరాలు ఎక్కువ కావడం, ఇతర ఛానళ్ల నుంచి మంచి శాలరీతో పాటు మెయిన్ యాంకర్‌గా ప్రమోట్ చేసే ఆఫర్లు రావడం వల్లే జబర్దస్త్ నుంచి వెళ్లాడని వివరించారు. ఈ విషయాన్ని సుధీర్ చాలామందితో ముందే డిస్కస్ చేశాడని కూడా రామ్ ప్రసాద్ స్పష్టం చేశాడు.

జబర్దస్త్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎక్స్‌క్లూజివిటీ ఒప్పందం ఉంటుందని హైపర్ ఆది మరో కీలక విషయం బయటపెట్టాడు. ఒక ఛానల్‌లో రెగ్యులర్‌గా పని చేస్తూ, మరో ఛానల్‌లో కూడా అదే సమయంలో ప్రోగ్రామ్స్ చేయడం కుదరదని చెప్పారు.'ఇక్కడ అక్కడ చేసుకుంటా అనేది సుధీర్ వెర్షన్ అయితే, అది కరెక్ట్ కాదు అనేది ఈటీవీ వెర్షన్' అని వివరించారు. అయితే చిన్న చిన్న గేమ్ షోలు లేదా వన్‌డే ప్రోగ్రామ్స్‌కు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపారు.

ఆర్పీ చెప్పినట్టు సుధీర్‌ను అవమానించి గెంటేశారు అనడం పూర్తిగా తప్పని రామ్ ప్రసాద్ ఖండించారు. సుధీర్‌కు మల్లెమాలపై ఇప్పటికీ గౌరవం ఉందని, జబర్దస్త్ వేదికపైనే ఎదిగి ఫైనాన్షియల్‌గా స్థిరపడ్డాడని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మల్లెమాలపై చెడుగా మాట్లాడే అవకాశమే లేదని ప్రశ్నించారు.

చివరిగా హైపర్ ఆది ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఆర్పీ చెప్పిన మాటలు నిజమా కాదా తెలుసుకోవాలంటే నేరుగా సుధీర్‌ని అడగండి అంటూ సూటిగా చెప్పాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని టీవీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి ఇది పాత ఇంటర్య్వూ .. జబర్దస్త్ చుట్టూ చెలరేగిన వివాదాలకు హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X