రోజాతో హైపర్ ఆది గొడవ: ఒక్కసారిగా పైకి లేచి అందరి ముందే అలా.. ఏకంగా అంత మాట అనడంతో!

తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తమ టాలెంట్లను నిరూపించుకుని బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. అంతలా ఈ కమెడియన్ దాదాపు ఐదారేళ్లుగా కడుపుబ్బా నవ్విస్తూ ముందుకు సాగుతున్నాడు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయినప్పటికీ.. మరికొన్ని కార్యక్రమాలు, స్పెషల్ ఈవెంట్లు, సినిమాల్లో సైతం తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ జడ్జ్‌ రోజాతో అతడు గొడవ పడ్డాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. జబర్ధస్త్‌గా కెరీర్

అలా పరిచయం.. జబర్ధస్త్‌గా కెరీర్

డబ్‌స్మాష్ వీడియోలు, యూట్యూబ్‌లో సినిమా స్ఫూఫ్‌లు చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు ఆది. అలా అప్పట్లో గుర్తింపును అందుకున్నాడు. ఆ సమయంలోనే అదిరే అభి సహాయంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత ఆర్టిస్టుగానూ మెప్పించాడు. దీంతో అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చి అభినందించారు జబర్ధస్త్ నిర్వహకులు.

టాప్ కమెడియన్‌ అయిపోయాడు

టాప్ కమెడియన్‌ అయిపోయాడు

దాదాపు ఎనిమిదేళ్లుగా జబర్ధస్త్ షో ప్రసారం అవుతోంది. ఇందులో ఎంతో మంది కమెడియన్లు తమదైన శైలి టైమింగ్‌తో సందడి చేస్తూ వచ్చారు. అయితే, హైపర్ ఆది వచ్చిన తర్వాత ప్రతి స్కిట్‌నూ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ.. తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే టాప్ కమెడియన్ అయ్యాడు.

 హవా చూపిస్తూ.. రికార్డుల క్రియేట్

హవా చూపిస్తూ.. రికార్డుల క్రియేట్

జబర్ధస్త్‌లోకి హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వకముందు చాలా మంది టీమ్ లీడర్లు హవాను చూపించారు. కానీ, అతడు ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరు ఎన్ని రకాల స్కిట్లు చేసినా అతడినే విజయం వరించేది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది చేస్తున్న స్కిట్లే ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఈ కమెడియన్ పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

ఎవరినీ వదిలిపెట్టని హైపర్ ఆది

ఎవరినీ వదిలిపెట్టని హైపర్ ఆది

తన స్కిట్లలో ఎక్కువ భాగం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు హైపర్ ఆది. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తుంటాడు. ఈ కారణంగానే అవన్నీ పేలుతున్నాయి.

దివాళీ స్పెషల్ ఈవెంట్‌లో కూడా

దివాళీ స్పెషల్ ఈవెంట్‌లో కూడా

ప్రతి పండుగకూ ఈటీవీలో స్పెషల్ ఈవెంట్‌ను రెడీ చేస్తుంటారు. ఇందులో భాగంగానే దీపావళి పండుగను పురస్కరించుకుని 'తగ్గేదేలే' అనే కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు. ఇందులో రోజా, ఇంద్రజ, పూర్ణ, ప్రియమణిలు సందడి చేశారు. అలాగే, పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇందులోనూ ఆది తన మార్క్ చూపించాడు.

రోజాతో హైపర్ ఆది గొడవ పడుతూ

'తగ్గేదేలే' ఈవెంట్‌లో భాగంగా రెండు టీమ్‌లుగా ఏర్పడిన సెలెబ్రిటీలు కొన్ని గేమ్స్ ఆడుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఒకరు సైగలు చేయగా.. మిగిలిన సభ్యులు అది ఏ సినిమానో కనుక్కునే గేమ్ ఆడారు. ఇందులో ముందుగా ప్రియమణి ఆడగా.. టీమ్ సభ్యులు కరెక్టుగా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఆది వంతు వచ్చింది. ఆ సమయంలో చిన్న గొడవ అయింది.

Recommended Video

Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
ఏకంగా అంత మాట అనడంతో!

ఏకంగా అంత మాట అనడంతో!

ఈ ఈవెంట్‌లో భాగంగా హైపర్ ఆది సైగల ద్వారా సినిమా పేరును కరెక్టుగా చెప్పారు అతడి టీమ్ సభ్యులు. అనంతరం రోజా 'మీరు అసలు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా ఆడారు' అంటూ ఎదుటి టీమ్‌తో సరదాగా గొడవ పడ్డారు. అప్పుడు ఆది 'మీరిచ్చింది ఎక్స్‌ప్రెషన్.. మేమిచ్చింది కాదు.. ఏం మాట్లాడుతున్నావ్? ఊరుకో' అంటూ రోజాపై గట్టిగా కేకలు వేశాడు. దీంతో అంతా షాకయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X