For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో వివాదంలో హైపర్ ఆది..ఆ వ్యక్తి చావు బతుకుల్లో.. షూటింగ్‌ జరుగుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు?

  |

  ఎంతో కాలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే క్రేజ్ తో నడుస్తున్న షో జబర్దస్త్. దాదాపు ఈ షో ప్రారంభమై 10 ఏళ్ల పైనే అవుతున్నా ఇప్పటికీ గురువారం, శుక్రవారం వస్తుంది అంటే ఈ షో చూడకుండా ఉండలేరు చాలామంది. ఇక యూట్యూబ్లో, ఫేస్బుక్ ద్వారా ఈ జబర్దస్త్ వీడియోలు చూసే వారి సంఖ్య మిలియన్లలోనే ఉంటుంది. ఈ షో వల్ల అనేక మంది కమెడియన్ల వెలుగులోకి వచ్చారు. వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించిన హైపర్ ఆది తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఏకంగా స్టేజ్ మీదకు పోలీసులు రావడం కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే

  విశ్వ ప్రయత్నాలు

  విశ్వ ప్రయత్నాలు


  ప్రస్తుతం మల్లెమాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి రష్మీ కొత్త హోస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో ప్రస్తుతం యాంకరింగ్ బాధ్యతలు రష్మీ చేపట్టి తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. మరోపక్క ఇంద్రజ స్థానంలో హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చింది. అయితే సుధీర్ స్థానంలో రష్మీ వచ్చింది కాబట్టి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసుకుని ఇలా చేస్తున్నారు అంటూ హైపర్ ఆది కౌంటర్లు వేస్తున్నాడు. సుడిగాలి సుదీర్ లేని లోటు తీర్చడం కోసం హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

  హైపర్ ఆది అన్యాయం

  హైపర్ ఆది అన్యాయం

  తాజాగా ఈ ఆదివారం నాడు ప్రసారం కావాల్సిన ప్రోమో విడుదల చేసింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక ఎప్పటిలాగే ఈ షో ప్రోమో ద్వారా షో మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. తొలుత హైపర్ ఆదికి సన్మానం అంటూ సన్మానం చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ముఖానికి ముసుగు వేసుకుని ఒక మహిళ అక్కడికి వచ్చి ఒక ఆడ దానికి అన్యాయం జరుగుతుంటే మీరు అక్కడ సన్మానాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించడంతో స్టేజి మీదకు రమ్మని పిలుస్తాడు హైపర్ ఆది. అసలు నీకు ఎవరు అన్యాయం చేశారు? అది తేలాకే నేను సన్మానం చేయించుకుంటాను అని హైపర్ ఆది అంటే నువ్వే చేశామని ఆమె ఆరోపిస్తోంది.

  సెట్లోకి రియల్ పోలీసులు

  సెట్లోకి రియల్ పోలీసులు


  అయితే ఇదంతా ఒక స్కిట్ లో భాగం అని తర్వాత అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఈ షోలో భాగమైన కొందరు సీరియల్ నటులు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇదిలా జరుగుతూ ఉన్న సమయంలో సెట్లోకి రియల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఎక్కడ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్టేజి మీద ఆది ఉన్నాడనే విషయం అర్థం కావడంతో వాళ్ళు కూడా స్టేజ్ మీదకు ఎక్కేశారు. ఈ దెబ్బకి హైపర్ ఆది మాత్రమే కాకుండా షో లో ఉన్న అందరూ కూడా షాక్ అయ్యి అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో కి వెళ్ళిపోతారు.

   పక్కకు వెళ్లి

  పక్కకు వెళ్లి


  స్టేజ్ పైకి వచ్చిన పోలీసులను హైపర్ ఆది ఏం జరిగింది సార్? అని అడిగితే ఏం జరిగిందో నీకు తెలియదా వస్తూ వస్తూ కారుతో గుద్ధి ఒక ఆక్సిడెంట్ చేశావు, ఇప్పుడు ఆ వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడని అంటారు. అందుకే మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చానని చెబుతారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ తింటారు. హైపర్ ఆది కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. అయితే అక్కడ ఉన్న నిర్వాహకులు షూటింగ్ జరుగుతోంది పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రండి అని కాస్త పోలీసు వారిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు వినకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు విడుదల చేసిన ప్రోమోలో కనిపిస్తోంది.

  పోలీసులు హడావుడి

  పోలీసులు హడావుడి

  చివరికి రాంప్రసాద్ సహా మిగతా కమెడియన్లు అందరూ స్టేజ్ మీదకు వచ్చి పోలీసువారిని బతిమిలాడి తర్వాత ఒక 10 నిమిషాలు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆదిని తీసుకు వెళ్ళ వచ్చు అని అంటారు. మరో వ్యక్తి మాత్రం అలా కాదు అని ఏదో మాట్లాడే ప్రయత్నం చేయడంతో అసహనానికి గురైన పోలీసులు ఆ వ్యక్తిని ఆయన వస్తానంటే ఆపడానికి నువ్వు ఎవరు అని సీరియస్ అవుతాడు. అయితే చివర్లో అసలు ముందు ఈ కెమెరాలు షూట్ చేయడం ఆపేయండి అంటూ సదరు పోలీసులు హడావుడి చేశారు.

  ప్రోమో కోసమే చేశారా

  ప్రోమో కోసమే చేశారా

  చివరికి హైపర్ ఆదిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కూడా ప్రసారం చేయడంతో ఆదివారం నాడు ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో మీద ఆసక్తి నెలకొంది. అయితే ఇదంతా నిజంగానే జరిగిందా? లేక హైపర్ ఆది మీద నిర్వాహకులు ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేశారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. గత వారం కూడా ఇలాగే హీరోయిన్ పూర్ణ మీద ఇమ్మానియేల్ అనుకోకుండా చేయి వేయడంతో పెద్ద రచ్చ జరిగినట్లు ప్రోమోలో చూపించారు. కానీ చివరికి ప్రోగ్రాం ప్రసారం అయ్యేసరికి తుస్సు మనిపించారు. అయితే ఇది కూడా ఇప్పుడు ప్రోమో కోసమే కట్ చేశారా లేక నిజంగానే ఆది విషయంలో ఏమైనా జరిగిందా అనే విషయం మీద మాత్రం ఆదివారం నాడు షో ప్రసారం అయితే గాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

  English summary
  Hyper aadi was arrested by police while shooting the Sridevi drama company, which was telecasted in the latest promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X