హీరోయిన్ బ్యాక్‌పై కొట్టిన హైపర్ ఆది: దెబ్బ తగిలిన చోటే ముద్దు.. చెప్ప రాని చోట కూడా!

బుల్లితెరపైకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు హైపర్ ఆది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. పంచులు, ప్రాసలతో కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అతడు.. ఒకవైపు షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. దీంతో తీరక లేకుండా బిజీగా గడుపుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆది హీరోయిన్ బ్యాక్‌పై కొట్టాడు. దీంతో పెద్ద రచ్చే జరిగింది. దీని వెనుక ఏం జరిగిందో మీరే చూడండి!

జబర్ధస్త్‌తో మారిన ఆది కెరీర్

జబర్ధస్త్‌తో మారిన ఆది కెరీర్

యూట్యూబ్‌లో స్ఫూఫ్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ జబర్ధస్త్‌గా మారింది.

మూవీల్లో రైటర్‌గా, యాక్టర్‌గా

మూవీల్లో రైటర్‌గా, యాక్టర్‌గా

జబర్ధస్త్ షో పుణ్యమా అని హైపర్ ఆది సెన్సేషన్ అయిపోయాడు. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రైటర్‌గానూ వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో హైపర్ ఆది 'ధమాకా', 'సార్' వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తద్వారా మరిన్ని అవకాశాలను అందుకున్నాడు.

జబర్ధస్త్‌‌కు గ్యాప్.. ఆ షోలలో

జబర్ధస్త్‌‌కు గ్యాప్.. ఆ షోలలో

సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్‌లో టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలంగా ఆ షోలో కనిపించడం లేదు. కానీ, 'ఢీ15', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింత హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ వెళ్లాక పడిపోయిన ఢీ షోను లేపే ప్రయత్నం చేస్తున్నాడు.

ఢీ 15వ సీజన్ సరికొత్తగానే

ఢీ 15వ సీజన్ సరికొత్తగానే


సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 15వ సీజన్‌ను జరుపుకుంటోంది. 'చాంపియన్స్ బ్యాటిల్' పేరుతో వస్తున్న ఈ సీజన్‌ను ఏ అండ్ బీ అనే రెండు టీమ్‌ల మధ్య పోటీగా మొదలెట్టారు. ఈ సీజన్‌కు హైపర్ ఆది, జస్వంత్ పడాలతో పాటు ఓ అమ్మాయి మెంటర్లు ఉన్నారు. శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్ దీనికి జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

పండుకు చెప్ప రాని చోట

పండుకు చెప్ప రాని చోట

'ఢీ 15' షోలోకి పండు మాస్టర్ వైల్డ్ కార్డు ద్వారా ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు వచ్చినప్పటి నుంచి షోలో కామెడీ మరింత ఎక్కువైపోయింది. ఇక రాబోయే ఎపిసోడ్‌లో కూడా పండు తనదైన రీతిలో కామెడీని పండించాడు. తన టీమ్ లేకున్నా వచ్చి రచ్చ చేశాడు. దీంతో శేఖర్ మాస్టర్‌తో పాటు ఆది, శ్రద్దా, ప్రదీప్ అతడిని చెప్పరాని చోట కూడా కొట్టేశారు.

హీరోయిన్ బ్యాక్‌పైన ఆది


పండు మాస్టర్‌ను కొట్టేందుకు అందరూ స్టేజ్ మీదకొచ్చారు. ఆ సమయంలో జడ్జ్ శ్రద్దా దాస్.. హైపర్ ఆదిని పలుమార్లు సరదాగా కొట్టింది. దీంతో అక్కడే ఉన్న ప్రదీప్.. 'ఈలోపు ఈవిడ ఆదిని కొడుతుంది' అన్నాడు. ఆ వెంటనే హైపర్ ఆది.. శ్రద్దా దాస్ బ్యాక్‌పైన కొట్టేశాడు. దీంతో ఆమెతో పాటు అక్కడున్న వాళ్లు షాక్ అయ్యారు. ఆ సమయంలో ఆది పారిపోయినా పట్టుకుని కొట్టారు.

దెబ్బ తగిలిన చోట ముద్దు

దెబ్బ తగిలిన చోట ముద్దు

శ్రద్దాను కొట్టిన తర్వాత హైపర్ ఆదిని అక్కడున్న వాళ్లు తరుముతూ వచ్చారు. దీంతో అతడు వెళ్లి జెస్పీ, దివ్య పక్కన కూర్చున్నాడు. అప్పుడు పండ మాస్టర్ ఆదిని కొట్టే ప్రయత్నం చేయగా.. అది దివ్య తలపై తగిలింది. దీంతో ఏం జరుగుతుందో అని అంతా భయపడ్డారు. అప్పుడు పండు ఆమెకు దెబ్బ తగిలిన చోట ముద్దు పెట్టి పరారయ్యాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X