‘వాడిలా నేను మోసం చేయను'.. రష్మిపై హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పదునైన పంచులు, వేగవంతమైన ప్రాసలు, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ కమెడియన్, చిన్నపాటి స్కిట్స్ నుంచి పెద్ద ప్రోగ్రామ్స్ వరకూ తనదైన స్టైల్‌ను చూపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 'జబర్దస్త్' షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆది, తక్కువ కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగి బుల్లితెరలో స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా యాంకర్ రష్మిపై హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కానీ, అసలైన గుర్తింపు మాత్రం జబర్దస్త్ ద్వారా పొందింది రష్మీ. తన యాంకరింగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కనిపించిన లవ్ ట్రాక్ కారణంగా మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం 'జబర్దస్త్'తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్ బుల్లితెరలో ఇప్పటికీ పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఆమె పేరు ముందుంటుంది. ప్రస్తుతం వరుస టీవీ షోలతో ఉన్న రష్మీ, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు.

Hyper Aadi Bold Comment on Rashmi Gautam in Sridevi Drama Company Goes Viral

ఇదిలా ఉండగా, ప్రస్తుతం శ్రీ దేవీ డ్రామా కంపెనీ (Sridevi Drama Company) ప్రోగ్రామ్‌లో హైపర్ ఆది చేస్తున్న కామెడీ మరోసారి వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న రష్మి గౌతమ్ తో కలిసి చేసిన తాజా స్కిట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షోకు మంచి ప్రేక్షకాదరణ ఉండగా, తాజాగా విడుదలైన ప్రోమోలో ఆది-రష్మీ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రోమోలో "మిస్టర్ అండ్ మిసెస్" అనే స్పెషల్ స్కిట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా హైపర్ ఆది, రష్మీ ఇద్దరూ పోటీపడే సన్నివేశం చూపించారు. ఈ సందర్భంగా రష్మీని మాటల్లో పడేయడానికి ప్రయత్నించిన ఆది, "ఇగో రష్మీ.. నేను వాడిలా హ్యాండ్ ఇవ్వను. ఇలాగే లైఫ్ లాంగ్ పట్టుకుంటా" అంటూ స్టేజ్‌పైనే బోల్డ్ కామెంట్ చేశాడు. అంతేకాదు, "నేను ఓడిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వు ఓడిపోతే మాత్రం నేను ఏడుస్తా" అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్ చెప్పి అందర్నీ నవ్వించాడు.

అయితే ఆది చెప్పిన మాటలకు రష్మీ పెద్దగా స్పందించకుండా, ఒక చిరునవ్వుతో పక్కకు తిరిగిపోయింది. ఈ సీన్ ప్రోమోలో హైలైట్‌గా మారి, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా "నేను వాడిలా హ్యాండ్ ఇవ్వను" అన్న ఆది డైలాగ్ నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కామెంట్ వెనుక ఉన్న అర్థం ఏమిటి? రష్మీకి "హ్యాండ్ ఇచ్చింది" ఎవరన్న ప్రశ్నలు నెట్టింట్లో వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నెటిజన్లు దీన్ని సుడిగాలి సుధీర్ తో రష్మీ మధ్య ఉన్న గత కెమిస్ట్రీకి లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

జబర్దస్త్ రోజుల నుంచి రష్మీ-సుధీర్ జోడీకి మంచి క్రేజ్ ఉండగా, వారి మధ్య "సంథింగ్ సంథింగ్" అంటూ అనేక రూమర్స్ కూడా వినిపించాయి. అయితే సుధీర్ ఇప్పుడు ఇతర ఛానెల్స్‌లో బిజీ కావడంతో, ఈ జోడీ విడిపోయినట్లైంది. అదే అంశాన్ని బేస్ చేసుకుని హైపర్ ఆది ఇలా కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు దీనిని కేవలం కామెడీ కోణంలో తీసుకుంటే, మరికొందరు మాత్రం ఆది డైలాగ్‌లో దాగిన ఇన్నర్ మీనింగ్‌పై చర్చిస్తున్నారు. మొత్తానికి, హైపర్ ఆది తన ప్రత్యేకమైన టైమింగ్‌తో మరోసారి ప్రోమోనే వైరల్ చేసేలా చేశాడు.ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రసారం కాబోయే ఈ పూర్తి ఎపిసోడ్‌లో ఇంకేం జరిగిందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X