వీడియో: సుధీర్‌తో హైపర్ ఆది గొడవ.. ఇప్పటి వరకూ కనిపించని కొత్త యాంగిల్ చూపించాడు.!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు కమెడియన్లు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా వీళ్లిద్దరూ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ షోలో హైపర్ ఆది పంచులతో ఫేమస్ అయితే.. సుధీర్ తన ప్రత్యేకమైన టాలెంట్లతో పాటు యాంకర్ రష్మీ వల్ల పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడపుతున్నారు. తాజాగా హైపర్ ఆది.. ఓ విషయంలో సుధీర్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది?

స్పీడు పెంచేసిన హైపర్ ఆది
హైపర్ ఆది కొద్ది రోజుల క్రితం వరకు ‘జబర్ధస్త్' షోలో మాత్రమే చేసేవాడు. ప్రస్తుతం అతడికున్న పాపులారిటీ నేపథ్యంలో మరిన్ని షోలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ‘ఢీ' చాంపియన్స్ సహా మరిన్ని షోలలో మెరుస్తున్నాడు. అలాగే, సినిమాల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే భారీగా ఆర్జిస్తున్నాడు.

నిరుత్సాహంలో సుధీర్
ఇటీవల సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా గత వారం విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో సుధీర్‌ను నిరాశ ఎదురైంది. ఇందులో ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. రాజశేఖర్ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించాడు.

ఇక్కడ మాత్రం రెచ్చిపోతున్నారు
ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న షోలలో మాత్రం రెచ్చిపోయి ప్రదర్శన ఇస్తున్నారు. ముఖ్యంగా ‘ఢీ' ఛాంపియన్స్ ప్రొగ్రాంలో ఆది, సుధీర్ వేరు వేరు టీమ్‌లకు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు సవాళ్లు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఈ షో మంచి కామెడీని పండిస్తోంది. ఫలితంగా రేటింగ్ పెంచుకుంటోంది.
మరో ప్రయోగంలో భాగమయ్యారు
ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల్లో మల్లెమాల సంస్థ ప్రత్యేకమైన షోలు చేస్తుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజు కూడా ఓ సరికొత్త కార్యక్రమంతో వస్తున్నారు. ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో వస్తున్న ఇందులో సుధీర్, ఆదితో పాటు రోజా, జానీ మాస్టర్ కనిపిస్తున్నారు. అలాగే, చాలా మంది యాంకర్లు, ఆర్టిస్టులు ఉన్నారు.

సుధీర్‌తో హైపర్ ఆది గొడవ
ఈ షోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య గొడవ జరిగినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. దీంతో అస్సలు డ్యాన్స్ రాని ఆది.. మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్‌తో పోటీ పడుతున్నాడు. ఈ క్రమంలోనే తనలోని కొత్త యాంగిల్ చూపించాడు హైపర్ కమెడియన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











