twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య వార్నింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది... అసలు ఏం జరిగిందంటే?

    |

    తెలుగు టీవీ రంగంలో సూపర్ పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్'లో హైపర్ ఆది తక్కువకాలంలోనే తన కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది వచ్చాక ఇతర టీమ్స్ వెనకబడిపోయాయనే ఒక అభిప్రాయం కూడా ఉంది.

    కేవలం జబర్దస్త్‌కే పరిమితం కాకుండా సినిమా అవకాశాలు సైతం దక్కించుకుంటూ దూసుకెళుతున్న ఆది.. అటు జనసేన పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రచారం చేస్తూ మీడియాలో హైలెట్ అవున్నారు. అయితే ఆ మధ్య ఆదికి ఏదో స్కిట్ విషయంలో బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఆది ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

    బాలయ్య వార్నింగ్‌పై ఆది క్లారిటీ

    బాలయ్య వార్నింగ్‌పై ఆది క్లారిటీ

    నాకు బాలకృష్ణగారు వార్నింగ్ ఇచ్చారనే వార్తలో నిజం లేదు. వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానల్స్ వారు పెట్టిన థంబ్‌నెయిల్ అది. అదిరే అభి టీమ్‌లో ఎప్పుడో ఎవరో రామారావుగారి గెటప్ వేశారని ఫ్యాన్స్ తరుపున ఎవరో ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయం నేను చెప్పడం వల్ల నాకు ఆపాదించారు. అంతే కానీ నాకు ఇచ్చిన వార్నింగ్ కాదు.. టీమ్‌లో ఎవరో ఆ గెటప్ వేస్తే ఆయనకు వచ్చిన వార్నింగ్ మాత్రమే అని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు.

    నాగబాబు, వరుణ్ తేజ్ గురించి

    నాగబాబు, వరుణ్ తేజ్ గురించి

    వరుణ్ తేజ్ సెట్స్ మీద హీరోగా కంటే నాగబాబు గారి అబ్బాయిగా ముందే పరిచయం. మమ్మల్ని నాగబాబు సర్ అప్పుడప్పుడూ ఇంటికి ఇన్వైట్ చేస్తుంటారు. అందరం కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తుంటాం. ఆ సమయంలో వరుణ్ తేజ్ షూటింగ్ నుంచో, జిమ్ నుంచో వస్తుంటారు. అలా ముందే పరిచయం. వరుణ్ తేజ్ కూడా జబర్దస్త్ చూస్తుంటారు. మంచి స్కిట్లను ఎంజాయ్ చేస్తుంటారు. వాటి గురించి ఆయనతో సినిమా చేసినపుడు లొకేషన్లో చెబుతుండేవారు.. అని ఆది తెలిపారు.

    జబర్దస్త్ షూటింగ్ ఎలా జరుగుతుందంటే...

    జబర్దస్త్ షూటింగ్ ఎలా జరుగుతుందంటే...

    ఒక నెలలో మూడు రోజులు జబర్దస్త్ షూటింగ్ ఉంటుంది. ఒక్కో షెడ్యూల్‌కు వారం గ్యాప్ ఉంటుంది. వారం అంతా దాదాపు అదే పనిలో ఉంటాం. ఒక రోజు ప్రాక్టీస్, ఒక రోజు షూట్ ఉంటుంది. మిగతా 5 రోజులు స్క్రిప్టు గురించి ఆలోచిస్తాం. తప్పకుండా అందరూ ముందు రోజు ప్రాక్టీస్‌‌కు వెళ్లాలి.

    వాళ్లకు లైన్ నచ్చకపోతే అంతే..

    వాళ్లకు లైన్ నచ్చకపోతే అంతే..

    డైరెక్షన్ డిపార్టుమెంటులో మనం ఎలాంటి స్కిట్ చేస్తున్నామో ముందే లైన్స్ చెప్పి ఓకే చేయించుకోవాలి. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే స్కిట్ మొదలు పెడతాం. వాళ్లకు మనం చెప్పే లైన్ నచ్చకపోతే తప్పకుండా వేరే లైన్ చెప్పాల్సిందే అని ఆది తెలిపారు.

    ఆ పార్టీని టార్గెట్ చేయలేదు, ట్రెండింగ్ అంశాలపైనే

    ఆ పార్టీని టార్గెట్ చేయలేదు, ట్రెండింగ్ అంశాలపైనే

    నేను ఒక పార్టీ వారినే టార్గెట్ చేస్తూ స్కిట్లు చేస్తున్నాననే ఆరోపణ నిజం లేదు. నాకు కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఇష్టం. వాటికి తగిన విధంగా నా స్కిట్లు అప్ డేట్ చేస్తుంటాను. ట్రెండింగ్ టాపిక్స్ అన్నింటి మీదా పంచులు వేస్తాను. ఒకరిని అని టార్గెట్ చేయడం అంటూ ఏమీ ఉండదని తెలిపారు.

    అంతా ఫ్రెండ్లీ నేచర్

    అంతా ఫ్రెండ్లీ నేచర్


    జబర్దస్త్ లొకేషన్లో అంతా ఫ్రండ్లీ నేచర్ ఉంటుంది. జడ్జిలు కూడా స్కిట్లో ఇన్వాల్వ్ అయి పంచులు వేస్తుంటారు. అంతా ఒక కుటుంబంలా ఉంటామని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

    English summary
    "There is no truth in the news. It was created just for the YouTube views." Hyper Aadi Clarify About Balakrishna Warning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X