తన ఎదుగుదలకు కారణం ఎవరో చెప్పేసిన హైపర్ ఆది

హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' షో ద్వారా ఈ యంగ్ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. మొదట వేరే టీమ్‌లో చేసినా ఆ తర్వాత తన టాలెంట్‌తో ఒక టీమ్‌కు కెప్టెన్ అయిపోయాడు. పంచులు, ప్రాసలతో స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

సినీ కెరీర్

సినీ కెరీర్

ఆది స్కిట్‌కు యూట్యూబ్‌లో సైతం ఎన్నో లక్షల వ్యూస్ వస్తుంటాయి. దీని బట్టే అతడి పాపులారిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అలాగే, అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. తక్కువ కాలంలోనే ఇంత పేరు సంపాదించుకున్న ఆది.. తన ఎదుగుదలకు ఎవరు కారణమో చెప్పేశాడు.

కారణం ఎవరో చెప్పేశాడు

కారణం ఎవరో చెప్పేశాడు

తాజాగా ఓ షోలో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అదిరే అభినే అని చెప్పాడు ఆది. ‘ఈ స్టేజ్‌ మీదే కాదు.. నేనీ స్థాయిలో ఉండడానికి అదిరే అభి అన్నే కారణం. ఆయనకు అందరి కంటే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న తర్వాత నన్ను ఆ రేంజ్‌లో ఎంకరేజ్ చేసింది మన డైరెక్టర్లు నితిన్ అన్నా, భరత్ అన్నా' అని ఈ యంగ్ కమెడియన్ చెప్పుకొచ్చాడు.

నా మీద నమ్మకం వచ్చింది

నా మీద నమ్మకం వచ్చింది

అసలు తనను ఆ డైరెక్టర్లు ఇద్దరూ నమ్మడానికి కారణం ఏమిటో కూడా ఆది వెల్లడించాడు. ‘అప్పట్లో డిసెంబర్ 31న ‘ఢీ'కి, ‘జబర్ధస్త్'కు మధ్య పోటీ పెట్టారు. ఆ ఎపిసోడ్‌కు నేను రాసిన స్క్రిప్ట్ నచ్చడంతో నా మీద వాళ్లకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నన్ను టీమ్ లీడర్‌ను కూడా చేశారు. అందుకే వాళ్లు ముగ్గురి గురించి గర్వంగా చెప్పుకుంటాను' అని వివరించాడు.

అభితో విభేదాలు

అభితో విభేదాలు

ఒకపక్క ‘జబర్ధస్త్'లో మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతున్న హైపర్ ఆది.. అదిరే అభితో గొడవ పడ్డాడని, వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇద్దరూ స్పందించినప్పటికీ ఆ పుకార్లకు మాత్రం పుల్‌స్టాప్ పడలేదు.

అభి క్లారిటీ ఇచ్చాడు

అభి క్లారిటీ ఇచ్చాడు

ఆదితో విబేధాలు ఉన్నాయన్న వార్తలపై అభి ఈ మధ్య స్పందించాడు. ‘హైపర్ ఆదికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాతో విభేదాల కారణంగానే హైపర్ ఆది బయటకు వెళ్లిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదు. కొత్త టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్గనైజర్లు భావించారు. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్‌ను తయారు చేశారు. అలా హైపర్ ఆది టీమ్ వచ్చింది. ఆది టీమ్ లీడర్ అయినందుకు సంతోషిస్తాన్నా' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X