రెమ్యూనరేషన్‌పై హైపర్ ఆది క్లారిటీ: ఒక్క స్కిట్‌కే అన్ని లక్షలు.. తొలిసారి పెదవి విప్పిన కమెడియన్

హైపర్ ఆది.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ యంగ్ కమెడియన్ సుదీర్ఘ కాలంగా తనదైన కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు సినిమాలు, షోలలో కనిపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఒక్కో స్కిట్‌కు ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న టాపిక్ హైలైట్ అవుతోంది. దీంతో తాజాగా అతడు ఓ షోలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌గా హైపర్ ఆది కెరీర్

జబర్ధస్త్‌గా హైపర్ ఆది కెరీర్

దాదాపు పదేళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా సందడి చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. దీంతో అతడి కెరీర్‌ జబర్ధస్త్‌గా సాగుతోంది.

టాలెంట్లతో స్టార్‌గా ఎదిగాడు

టాలెంట్లతో స్టార్‌గా ఎదిగాడు

ఏ షోలో అయినా హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్నది తెలిసిందే. అలాగే, యూట్యూబ్‌లో అతడికి వచ్చే వ్యూస్‌ను బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అతడి స్కిట్ల కోసం టీవీల ముందు కూర్చునే వాళ్లూ ఉన్నారు. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.

సినిమాల్లోనూ సత్తా చాటుతూ

సినిమాల్లోనూ సత్తా చాటుతూ

తనదైన కామెడీతో బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టేశాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్‌గానూ వర్క్ చేసి సత్తా చాటాడు.

జబర్ధస్త్‌ రీఎంట్రీ.. ఆ షోలలో

జబర్ధస్త్‌ రీఎంట్రీ.. ఆ షోలలో

సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్‌లో టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలం పాటు ఆ షోలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత అతడు షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింతగా హవాను చూపిస్తున్నాడు.

శ్రీదేవిలో హైలైట్.. బావగారు

శ్రీదేవిలో హైలైట్.. బావగారు

తాజాగా హైపర్ ఆది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొంది. గత ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌ను 'బావగారూ బాగున్నారా' అనే కాన్సెప్టుతో చూపించబోతున్నారు. ఇక, ఇందులో హైపర్ ఆది తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అంతేకాదు, ప్రత్యేకమైన స్కిట్లతో చాలా హైలైట్ అయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్ కూడా సూపర్ సక్సెస్‌ అయిపోయింది.

ఆది స్కిట్‌ రెమ్యూనరేషన్

ఆది స్కిట్‌ రెమ్యూనరేషన్

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా గత ఎపిసోడ్ చివర్లో కొందరు సెలెబ్రిటీలకు సంబంధించిన గాసిప్పుల గురించి చూపించి.. వాటికి సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేశారు. ఇందులోనే 'హైపర్ ఆది ఒక్క స్కిట్‌కు ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా' అన్న ప్రశ్న వచ్చింది. దీంతో తొలిసారి తన రెమ్యూనరేషన్ గురించి అతడు స్పందించాడు.

తొలిసారి క్లారిటీ ఇచ్చిన ఆది

తొలిసారి క్లారిటీ ఇచ్చిన ఆది

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా తన రెమ్యూనరేషన్ గురించి వచ్చిన ప్రశ్నకు హైపర్ ఆది స్పందిస్తూ.. 'మేము ఒక్కో స్కిట్ చేయాలంటే చాలా శ్రమించాలి. పంచులు రాసుకోవాలి.. డైలాగులు రాసుకోవాలి. ఇలా చాలా కష్టం ఉంటుంది. అందుకే ఒక్కో స్కిట్ కోసం నేను ఇంత తీసుకుంటాను' అంటూ అసలు విషయం చెప్పకుండా రెండు చేతులతో సైగలు చేసి షాకిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X