twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగన్‌ను ఉద్దేశించి హైపర్ ఆది కామెంట్, అంతా ఫేక్, గొడవలు వద్దంటూ..

    |

    2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైంది. కుళ్లిపోయిన వ్యవస్థలో మార్పు తేవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినప్పటికీ వారి నుంచి పెద్దగా మద్దతు లభించలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

    కాగా... జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల్లో తన శక్తిమేర శ్రమించారు. వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అయితే ఓటర్ల తీర్పుతో షాకైన ఆయన ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    నిజంగా హైపర్ ఆది ఈ మాటలు అన్నారా?

    నిజంగా హైపర్ ఆది ఈ మాటలు అన్నారా?

    ఏపీ ప్రజలు మద్యానికి అమ్ముడు పోయారని, ఈరోజు ఓడిపోయింది పవన్ కళ్యాణ్ కాదు... తెలుగు ప్రజలు అంటూ హైపర్ ఆది ట్వీట్ చేసినట్లు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మే 23, 2019వ తేదీని బ్లాక్ డేగా అభివర్ణించినట్లు... సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనపై జరుగుతున్న ఈ వార్తలపై ఆది స్పందించారు.

    అంతా ఫేక్ అంటున్న ఆది

    అంతా ఫేక్ అంటున్న ఆది

    నా పేరు మీద నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎవరో ఫేక్ పోస్టులన్నీ పెడుతున్నారని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని హైపర్ ఆది తెలిపారు. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. తనకు ఎటువంటి అకౌంట్స్ లేవని తెలిపారు.

    జగన్‌ను ఉద్దేశించి..

    జగన్‌ను ఉద్దేశించి..

    ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆది కామెంట్ చేశారు. 30వ తేదీన ప్రమాణ స్వీకరాం చేయబోతున్న జగన్ గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

    పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన వారికి ధన్యవాదములు

    పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన వారికి ధన్యవాదములు

    ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి, ఆయనపై నమ్మకం ఉంచి జనసేన పార్టీకి ఓటు వేసిన వారికి ఈ సందర్భంగా హైపర్ ఆది మద్ద ధన్యవాదములు తెలియజేశారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఓదార్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ బాటలో ప్రజల తరుపున పోరాటం చేస్తూ ముందకు సాగుదామన్నారు.

    గొడవలు వద్దంటున్న ఆది

    గొడవలు వద్దంటున్న ఆది

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరించాల్సిన బాధ్యత మన అందరి మీదా ఉంది. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎవరూ ఎవరి మీద కూడా నెగెటివ్ పోస్టులు పెట్టకండి. గొడవలు, వివాదాలు మనకు వద్దు అని హైపర్ ఆది సూచించారు.

    English summary
    Jabardasth fame actor Hyper Aadi congratulated YSRCP Chief YS Jagan Mohan Reddy, who is the next Chief Minister of Andhra Pradesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X