అందుకే వర్షిణితో ఆ రేంజ్ కెమిస్ట్రీ.. రొమాన్స్‌పై ఆది క్లారిటీ.. రష్మి, సుధీర్‌ కంటే..

జబర్దస్త్‌లో కమెడియన్‌గా ఆది లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఇక అదే ఊపులో యూట్యూబ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఘనతను సొంతం చేసుకొంటున్నారు. ఇటీవల ఢీ షోలో వర్షిణితో కెమిస్ట్రీ ప్రత్యేకంగా మారింది. రష్మీ, సుధీర్ జంటను బీట్ చేసే రొమాన్స్ ప్రదర్శిస్తున్న క్రమంలో తన అభిప్రాయాన్ని ఆది వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

రష్మీ, సుధీర్ జంటకు

రష్మీ, సుధీర్ జంటకు

ఒకప్పుడు, ఇప్పుడు రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ జంటకు ఎక్కువగా యూట్యూబ్‌లో క్రేజ్ ఉండేది. ఎక్కడ చూసినా వారి వీడియోలు ట్రెండ్ అయ్యేవి. ఇప్పటికీ అలానే ఉంది పరిస్థితి. అయితే ఢీ షో కోసం కొత్తగా వర్షిణితో జంటగా వ్యవహరించాల్సి వచ్చింది. స్కిట్, షో కోసం అలా రొమాంటిక్‌గా వ్యవహారించాల్సి వస్తున్నది అని ఆది అన్నారు.

 సుధీర్, రష్మీ జోడి ఎవర్ గ్రీన్

సుధీర్, రష్మీ జోడి ఎవర్ గ్రీన్

సుధీర్, రష్మి జోడి ఎవర్ గ్రీన్. మేము బయటకు వెళ్లితే వారి గురించే అడుగుతారు. అలాంటి జోడి ఓ టీమ్‌లో ఉంటే.. మా టీమ్‌లో కూడా స్ట్రాంగ్ జోడి ఉండేలా చర్యలు తీసుకొన్నాం. ఆ జంట ప్రూవ్ చేసుకొన్నది. కాబట్టి మేము అలాంటి రొమాన్స్‌ను కేవలం స్క్రీన్‌పై చూపిస్తున్నాం. ఆన్ స్క్రీన్ తప్ప మా మధ్య ఆఫ్ స్క్రీన్‌లో రొమాన్స్ ఉండదు అని ఆది చెప్పారు.

నా డ్యాన్స్ రాదు

నా డ్యాన్స్ రాదు

బేసిక్‌గా నాకు డ్యాన్స్ రాదు. ఢీ షో కోసం నేను నేర్చుకొంటున్నాను. ఏదో నాకు వచ్చిన స్టెప్పులతోను అలా కెమిస్ట్రీ, ఫిజిక్స్ కలిపేస్తున్నాం. డ్యాన్స్ షోలో డ్యాన్స్ రాకుంటే ఎలా అని ప్రశ్నించే అవకాశం ఉంటుందని.. నేను డ్యాన్స్‌పై శ్రద్ద తీసుకొంటున్నాను. అంతేగానీ నేను డ్యాన్స్‌లో చాలా వీక్ అని ఆది తెలిపారు.

అవకాశాలను బట్టి నేను

అవకాశాలను బట్టి నేను

నాకు వస్తున్న అవకాశాల కారణంగా నాలో మార్పులు చేసుకొంటున్నాను. కమెడియన్‌గా కాకుండానే డ్యాన్సర్‌గా, సింగర్‌గా ప్రయత్నిస్తున్నాను. ఛాన్స్ వస్తుండటం వల్లే నేను కొత్తగా ప్రయత్నించే అవకాశం దక్కుతున్నది. ఇలాంటి అవకాశాలు ఎంత మందికి వస్తుంటాయి చెప్పండి. వచ్చిన ఛాన్సులను వినియోగించుకోవడమే మన కర్తవ్యం అని ఆది పేర్కొన్నారు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
మాస్ ఆడియెన్స్ ప్రజాదరణ

మాస్ ఆడియెన్స్ ప్రజాదరణ

ఢీ షో తర్వాత నాకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. మాస్ ఆడియెన్స్ నాకు మరింత దగ్గర అవుతున్నారు. ఫ్యాన్ మూమెంట్స్ ఏమీ లేవు. సాధారణంగా మమల్ని ఇష్టపడుతుంటారు. ఎక్కడైనా వెళితే మమల్ని బాగా పలకరిస్తారు. బాగా చూసుకొంటారు. మంచి ఆదరణను పొందడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తుంటాం అని ఆది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X