For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్

  |

  అదిరిపోయే పంచులు.. ఆకట్టుకునే ప్రాసలు.. పొట్టచెక్కలు చేసే హావభావాలు.. నవ్వు తెప్పించే డైలాగులు.. అన్నింటికీ మించి ప్రతి స్కిట్‌ను వన్ మ్యాన్ షోగా మార్చేస్తూ తెలుగు బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. రైటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో అన్ని షోలనూ చేయకుండా కొన్నింటికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ డైలాగులు చెప్పాడంటూ సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

   ఆ షోతో లైఫ్.. టాప్ ప్లేస్‌లోకి

  ఆ షోతో లైఫ్.. టాప్ ప్లేస్‌లోకి

  యూట్యూబ్‌లో స్ఫూఫ్ వీడియోలు చేస్తూ హైపర్ ఆది ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి.. అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ టైమ్‌లోనే తనదైన శైలి స్కిట్లతో పాపులర్ అయ్యాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫన్నీ స్కిట్లు చేశాడు. ఇవన్నీ తన పంచ్‌లు, ప్రాసలతో వన్ మ్యాన్ షోలుగా మార్చుకుని స్పెషల్‌గా నిలిచాడు.

  తల్లైనా తగ్గని కాజల్ అగర్వాల్: టాప్‌ను కిందకు జరిపి మరీ అందాల ఆరబోత

  మూవీల్లో కూడా సక్సెస్‌గానే

  మూవీల్లో కూడా సక్సెస్‌గానే


  జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఫేమస్ అయిన హైపర్ ఆదికి సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌లో నటించాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా తనలోని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయట పెట్టేశాడు.

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ రెండే

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ రెండే

  హైపర్ ఆది సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడు జబర్ధస్త్‌ షోను మరింత రేంజ్‌కు తీసుకు వెళ్లాడు. అయితే, ఇప్పుడు అతడు ఆ షోకు బ్రేక్ ఇచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో అతడు జబర్ధస్త్ నుంచి తప్పుకున్నాడు. అయితే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రమే సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రాశీ ఖన్నా: అందాల తెర తెంచేసి ఎద భాగం కనిపించేలా!

  కాసింత డ్యాన్స్.. కొంచెం ఫన్

  కాసింత డ్యాన్స్.. కొంచెం ఫన్


  దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. ఇక, ఈ షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ వీళ్ల సందడితో మరింత ఫన్నీగా సాగబోతున్నట్లు ప్రోమోలో చూపారు.

   ఈ సారి పొలిటికల్ థీమ్‌తో

  ఈ సారి పొలిటికల్ థీమ్‌తో

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 14వ సీజన్‌ ఎపిసోడ్‌లో మరో ఇద్దరు కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లతో హైపర్ ఆది పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధం అయినట్లు చూపించారు. ఇందులో ఆది 'వేస్తే వెయ్.. లేకపోతే...' అనే పార్టీని పెట్టినట్లు చెప్పాడు. ఆ పేరు చెప్పగానే అక్కడున్న వాళ్లంతా నవ్వలేక పొట్టలు పట్టుకున్నారు. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగిపోయింది.

  మసాజ్ వీడియో షేర్ చేసిన పాయల్: బట్టలు లేకుండానే.. అది పెద్దదైందని చూపిస్తూ!

   ఆది పార్టీ పేరు... నవ్విస్తూ

  ఆది పార్టీ పేరు... నవ్విస్తూ

  గెస్టులుగా వచ్చిన ఇద్దరు కుర్రాళ్లను హైపర్ ఆది మీ పార్టీ ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్లలో ఒకరు 'మేము విన్నాం' అని.. మరొకరు 'మేము ఉన్నాం' అని చెప్పారు. దీంతో హైపర్ ఆది 'సరే మేము ఉంటాం' అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రోమో మొత్తంలో హైపర్ ఆది చెప్పిన ఈ డైలాగులు మాత్రమే తెగ హాట్ టాపిక్ అయిపోతున్నాయి.

  ఆ పార్టీ ఫ్యాన్స్ ట్రోల్స్‌తో


  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో 'నేనున్నాను.. నేను విన్నాను' అనే డైలాగ్ చెప్పేవారు. దీన్నే 'సర్కారు వారి పాట' మూవీలోనూ వాడారు. ఇప్పుడు 'ఢీ' షోలో అలా చెప్పగానే ఆది పంచ్ వేయడంతో వైసీపీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అతడిని బండ బూతులు తిడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Paticipated in Dhee Show. His Comments Creates Controversy in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X